గోడ చాటు ఏం జరుగుతుందో?

Posted By: Prashanth

గోడ చాటు ఏం జరుగుతుందో?

 

వాషింగ్టన్: గోడల మాటున జరిగే వ్యవహారాలను ఇట్టే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. అంటే నాలుగు గదుల నడుమ ఏం జరుగుతుందో.. ఏఏ వస్తువులున్నాయో అన్న వివరాలను కెమెరా ద్వారా రాబట్టేగలిగే రోజులు అతీ సమీపంలో ఉన్నాయి. త్రీడి చిత్రాల ద్వారా గోడలకు అటువైపున ఏముందో చూపించే సరికొత్త లేజర్ టెక్నాలజీని అమెరికాలోని ఎంఐటీకి చెందిన భారత సంతతి గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆట్ క్రిస్ట్ గుప్తా నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది.

ప్రాథమిక కణాలైన ఫోటాన్ (కాంతికి ప్రమాణం)లకు ఉండే ప్రత్యేక లక్షణాలను ఆధారంగా చేసుకుని ఎంఐటీ, హార్వార్డ్, విస్కాన్సిన్, రైస్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఈ మేరకు వినూత్న పద్ధతిని కనుగొన్నారు. ఫోటాన్లు ఒక గదిలోని వస్తువులపై పడినప్పుడు ఆ వస్తువుల చుట్టూ తిరుగుతూ ప్రయాణించడం, వస్తువును ఢీకొని ఎగిరి అస్తవ్యస్తంగా వ్యాపించడం, వెనక్కి తిరిగి రావడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తుంటాయి. ఈ లక్షణాల ఆధారంగానే లేజర్ టెక్నాలజీ, ప్రత్యేకమైన టూడీ స్ట్రీక్ కెమెరాలతో ఫోటాన్లను చిత్రించవచ్చని, తద్వారా వాటిని త్రీడీ చిత్రాలుగా మలచి గోడలకు ఆవల ఉన్న వస్తువుల ఆకారాలు, ఏ దిక్కున, ఎంతదూరంలో ఉన్నాయన్న విషయాలను కచ్చితంగా తెలుసుకోవచ్చని గుప్తా వెల్లడించారు.

కాగా, శిథిలాల కింద చిక్కుకునే మనుషులు, భవనాల్లో దాగిన ఉగ్రవాదులు లేదా హైజాకర్లను ఈ టెక్నాలజీతో గుర్తించే వీలుంది. రోగుల దేహాలను స్కానింగ్ చేసేందుకూ ఉపయోగపడే అవకాశముంది. అయితే మరో ఐదు నుంచి పదేళ్లలోపు పరిశోధనల తర్వాతే ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot