ఫోన్ డెలివరీ ఆలస్యం అయినందుకు 20 సార్లు కత్తితో పొడిచింది

|

ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందరూ ఆన్ లైన్ ద్వారా ఫోన్లు బుక్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ ఫోన్లు అనుకున్న సమయానికి మనచేతికి అందవు. ఎంతో ఆ ఫోన్లు బుక్ చేసిన తరువాత అనుకున్న సమయానికి అవి చేతికి రాకుంటే మనకు అసహనం వస్తూ ఉంటుంది. అలాంటి సంధర్బాలో డెలివరీ బాయ్ మీద ఉన్న కోపాన్ని మొత్తం తీర్చుకుంటాం. అయితే ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్‌ను ఆలస్యంగా డెలివరీ చేసిన బాయ్‌పై కత్తితో దాడిచేసిన మహిళ విచక్షణ రహితంగా పొడిచి పారేసింది. ఈ విషాద ఘటన ఢిల్లీలో జరిగిందీ . ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకెళితే..

 

కళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతంకళ్లు చెదిరే కెమెరాలు, అబ్బురపరిచే ఫీచర్లు, ఈ ఫోన్ సొంతం

కొత్త ఫోన్‌ను చూసుకోవాలన్న ఆతృతతో..

కొత్త ఫోన్‌ను చూసుకోవాలన్న ఆతృతతో..

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతానికి చెందిన కమల్ దీప్ (30) ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసింది. కొత్త ఫోన్‌ను చూసుకోవాలన్న ఆతృతతో ఉన్న కమల్ దీప్ పదేపదే డెలివరీ బాయ్‌కు ఫోన్ చేసింది. అయితే, అడ్రస్ కనుక్కోవడం కష్టంగా మారడంతో ఫోన్ డెలివరీ ఆలస్యమైంది.

ఎలాగోలా అడ్రస్ కనుక్కుని..

ఎలాగోలా అడ్రస్ కనుక్కుని..

చివరికి ఎలాగోలా అడ్రస్ కనుక్కుని కమల్ దీప్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌ను చూడగానే కమల్ రంకెలేసింది. పెద్దగా అరుస్తూ వాగ్వాదానికి దిగింది. ఆలస్యానికి కారణం చెబుతున్నా వినిపించుకోని ఆమె వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి అతడిపై దాడి చేసింది.

 షూ లేస్‌తో..
 

షూ లేస్‌తో..

కడుపులో విచక్షణ రహితంగా పొడిచింది. ఇంట్లోనే ఉన్న ఆమె సోదరుడు జితేందర్ సింగ్(34) కూడా ఆమెతో జతకలిశాడు. షూ లేస్‌తో అతడి గొంతు బిగించి చంపేందుకు ప్రయత్నించారు.రక్తపు మడుగులో పడి ఉన్న డెలివరీ బాయ్ నుంచి ఫోన్‌తోపాటు, అతడి వద్ద ఉన్న రూ.40 వేలను దోచుకున్నారు. అనంతరం ఓ వాహనంలో డెలివరీ బాయ్‌ను ఎక్కించి చందర్ విహార్ ప్రాంతంలోని ఓ మురికి కాల్వ వద్ద పడేశారు.

పోలీసులకు సమాచారం ..

పోలీసులకు సమాచారం ..

రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సంజయ్ గాంధీ ఆసుపత్రిలో బాధితుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతడి కడుపులో 20 కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

డెలివరీ బాయ్..

డెలివరీ బాయ్..

అయితే డెలివరీ బాయ్ ఆ ప్రాంతానికి కొత్త కావడంతో అడ్రస్ కనుక్కోవడంలో కొంచెం ఆలస్యం జరిగిందని ఈ లోపే అతని ఫోన్ కి ఆ మహిళ కొన్ని వందల కాల్స్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ విషయం మీద ఫ్లిప్ కార్ట్ స్పందన ఇంకా రాలేదు. కాబట్టి డెలివరీ బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి.

 

 

Best Mobiles in India

English summary
Delhi woman stabs Flipkart delivery man over 20 times because mobile phone reached her late More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X