రాత్రి ఎనిమిది తర్వాత భోజనం చేస్తే బాగా లావు అవ్వుతారా?

By Super
|
Late Night Eaters
ఇటీవల కాలంలో మనుషులకు సంబంధించి ఓ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం రాత్రి పూట ఎనిమిది గంటలు తర్వాత ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారి శరీరంలో బాడీ మాస్ ఇండెక్సెస్(BMIs) అధిక శాతంలో పెరుగుతాయని వెల్లడించారు. ఇక ఎవరైతే ఈ టైంలో ఆహారం తీసుకోకుండా అంతక ముందు తీసుకుంటారో వారిలో శరీరంలో మాత్రం బాడీ మాస్ ఇండెక్సెస్(BMIs) చాలా తక్కువగా ఉన్నయాని పరిశోధకులు వెల్లడించారు.

రాత్రిపూట ఎవరైతే స్నాక్స్ రూపంలో గానీ, ఆహార రూపంలోగానీ ఎనిమిది తర్వాత తీసుకుంటారో వారు మాత్రం శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా పెరిగి బాగా లావుగా కనిపించనున్నట్లు సర్వేలో వెల్లడించారు. అంతేకాకుండా రాత్రి సమయంలో కాకుండా పగలు అంతే కాలరీలు తీసుకునే వారిలో మాత్రం తేడా ఉన్నట్లు సర్వే అధికారులు వెల్లడించడం జరిగింది. ఇది మాత్రమే మనిషి యొక్క శరీరం తీరు అతను టైమ్‌కి ఆహారం తీసుకునే విధానం, రాత్రుళ్శు అతను నిద్ర మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు.

మధ్యాన్నం ఆహారం తినేవారు, రాత్రిపూట ఆహారం తీసుకునే వారిలో క్యాలరీల శాతం చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు. రాత్రిపూట కొంత మంది ప్రూట్స్, ఫలహారాలు తీసుకుంటుంటే మరికొంత మంది జంక్ పుడ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. చివరగా సర్వే అధికారులు విషయంలో వెల్లడైంది ఏమిటంటే చాలా మంది టైమ్‌కి ఆహారం తీసుకోక పోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటన్నింటిని అధిగమించాలంటే సరైన టైమ్‌కి ఆహారం తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని వెల్లడించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X