Jio నుంచి రోజుకు 2GB డేటా అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే..!
భారత టెలికాం రంగంలో Reliance Jio అత్యధికంగా యూజర్ల బేస్‌ను కలిగి ఉంది. దాదాపు 40.5 కోట్ల మంది యూజర్లను ఈ టెలికాం సంస్థ కలిగి ఉంది. భారత్‌లోని మొబైల్ యూజర్లకు Jio సంస్థ అఫర్డబుల్ ధరల్లో 4జీ సర్వీసెస్‌ను ఆఫర్ చేస్తోంది. కాగా, ప్రస్తుతం జియో నుంచి రోజుకు 2జీబీ డైలీ డేటా ఆఫర్ చేస్తున్న ప్లాన్లకు సంబంధించిన వివరాలను ఓ సారి చూద్దాం.

Reliance Jio నుండి రోజుకు 2GB డేటాతో విడుదలైన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాను మేం ఇక్కడ సిద్ధం చేశాం. రూ.249 నుంచి రూ. 2,879 మధ్య ఉన్న అన్ని ప్రీపెయిడ్ ప్యాక్‌ల వివరాలను వినియోగదారులు ఇక్కడ చూడొచ్చు. వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Jio రూ.249 ప్లాన్:
రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ప్లాన్లలో రూ.249 ప్లాన్ అనేది చాలా అఫర్డబుల్ ప్రీపెయిడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇది 23 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2జీబీ డేటాను పొందొచ్చు. మొత్తంగా 23 రోజుల వ్యవధిలో 46జీబీ హై స్పీడ్ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. డైలీ డేటా లిమిట్ దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ ఉంటుంది. ఇవే కాకుండా, ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం పొందవచ్చు. వీటితో పాటు, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌కు సంబంధించి ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

Jio రూ.299 ప్లాన్:
రిలయన్స్ జియో రూ.249 ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2జీబీ 4జీ డేటాను పొందొచ్చు. మొత్తంగా 28 రోజుల వ్యవధిలో 56జీబీ హై స్పీడ్ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఇవే కాకుండా, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌కు సంబంధించి ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

జియో రూ.533 ప్లాన్:
రిలయన్స్ జియో రూ.533 ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మొత్తంగా 56 రోజుల వ్యవధిలో 112జీబీ హై స్పీడ్ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు మెసేజ్‌ల సౌకర్యం పొందవచ్చు.
Jio రూ.719 ప్లాన్:
రిలయన్స్ జియో రూ.719 ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మొత్తంగా 84 రోజుల వ్యవధిలో 168జీబీ హై స్పీడ్ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు మెసేజ్‌ల సౌకర్యం పొందవచ్చు.

Jio 2జీబీ డేటాతో పాటు, డిస్నీ-హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్:
జియో రూ.799 ప్లాన్ రోజుకు 2 జీబీ డేటాను అందిస్తూనే.. యూజర్లకు డిస్నీ-హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కల్పిస్తోంది. దీని వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది. మొత్తంగా 56 రోజుల వ్యవధిలో 112జీబీ హై స్పీడ్ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఇవే కాకుండా, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌కు సంబంధించి ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
Jio రూ.1066 ప్లాన్:
జియో రూ.1066 ప్లాన్ ద్వారా సేమ్ రూ.799 తో పొందే ప్రయోజనాలను పొందొచ్చు. వ్యాలిడిటీ మినహా మిగతా అంతా సేమ్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. మొత్తంగా 84 రోజుల వ్యవధిలో 168జీబీ హై స్పీడ్ డేటాను ఎంజాయ్ చేయవచ్చు.

Jio లో 2జీబీ డైలీ డేటాతో ఇయర్ ప్లాన్:
జియోలో రోజుకు 2జీబీ డేటాను ఆఫర్ చేస్తున్న ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ కూడా ఉంది. అదే రూ.2789 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ఏడాది కాలం పాటు రోజుకు 2 జీబీ డేటాను పొందొచ్చు. మొత్తం ఏడాది కాలంలో 730జీబీ డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఇవే కాకుండా, ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ ల సౌకర్యం పొందవచ్చు. కానీ, ఈ ప్లాన్‌కు అదనంగా ఎలాంటి కంటెంట్ సర్వీసులను అందించడం లేదు.
ఇక ఇతర టెలికాం కంపెనీల ఆఫర్లతో పోలిస్తే.. జియో సరసమైన ధరల్లో మంచి ప్లాన్లు ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇతర పోటీదారులు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఈ ధరల్లో 1.5జీబీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి, వినియోగదారులు రీఛార్జీకి ముందు వీటిని పరిశీలించి నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.

రిలయన్స్ Jio రూ.2,999 ప్లాన్:
రిలయన్స్ Jio కు సంబంధించి 2022 ప్రారంభంలో విడుదలైన దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,999. లాంగ్ టర్మ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తంలో కంపెనీ 912.5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. దాంతో పాటు పలు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. ఇంకా అదనంగా జియో యూజర్లు Jio టీవీ, Jio సినిమా, Jio సెక్యురిటీ, Jio క్లౌడ్ యాక్సెస్ కూడా కల్పిస్తోంది. FUP లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది.


Click it and Unblock the Notifications








