బెంగుళూరులో దారి తప్పారా..?

Posted By: Prashanth

బెంగుళూరులో దారి తప్పారా..?

 

సర్వోత్తమ సిటీ.. ఎటూ చూసినా గ్రీనరీ..తప్పుకునేందుకు ఖాళీ లేని ట్రాఫిక్... రింగు రింగుల ఫ్లై ఓవర్లు... దిమ్మ తిరిగే భవంతులు.. కల లాంటి నిజం బెంగుళూరు సొంతం.. అవును గ్రీన్ సిటీ బెంగుళూరు దేశంలోని ఉత్తమ నగరాల్లో ఒకటి.. ఈ ప్రదేశంలో కొత్త మనుషులు అలవోకగా తప్పిపోయేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇటువంటి వారి సహాయార్ధం లాట్‌లాంగ్ అనే ఎస్ఎమ్ఎస్ సర్వీస్‌ను ఇక్కడ ప్రారంభించారు. ఈ మహానగరంలో దారి తప్పిన వ్యక్తులు 9008890088కి ఎస్ఎమ్ఎస్ చేస్తే చాలు. వారి మార్గం సుగమమైనట్లే. జీపీఎస్ వ్యవస్థ కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమైన నేపధ్యంలో, సాధారణ హ్యాండ్ సెట్ యూజర్లకు ఈ సర్వీస్ మరింత ఉపయుక్తంగా నిలవనుంది.

బేసిక్ ఫోన్ వినియోగిస్తున్న వినియోగదారులు ఎస్ఎమ్ఎస్ పంపాల్సిన విధానం:

ఉదాహరణకు మీరు జయనగర్ 4th బ్లాక్ నుంచి ఎంజీ రోడ్‌కు చేరుకోవాలి. అప్పడు మీరు చేయ్యాల్సిన ఎస్ఎమ్ఎస్ విధానం ఈ విధంగా ఉండాలి. Jayanagar 4th Block To MG Road అని 90089008కి పంపితే చాలు మీరు ఎంజీ రోడ్ చేరుకునేంత వరకు ఫోన్‌లో డైరెక్షన్స్ వస్తునే ఉంటాయి. .

రెస్టారెంట్స్, సినిమా హాల్స్, పెట్రోల్ బంక్స్, ఏటీఎమ్ సెంటర్లను కనుగొనేందుకు ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఈ సేవను ఎవరైన సరే ఉచితంగా వినియోగించుకోవచ్చు. నెట్‌వర్క్ సరైనదై ఉండాలి. ఈ సారి బెంగుళూరు వచ్చినప్పుడు ఈ సేవను తప్పకుండా వినియోగించుకుంటారు కదూ!!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot