మొబైల్ సిమ్‌ను సపోర్ట్ చేసే ఇంటర్నెట్ డాంగిల్!!

Posted By: Super

మొబైల్ సిమ్‌ను సపోర్ట్ చేసే ఇంటర్నెట్ డాంగిల్!!

 

టెక్నాలజీతో సాధ్యం కానిదంటూ ఏది లేదని లావా నిరూపించింది. తాజాగా ఈ బ్రాండ్ తయారుచేసిన 3జీ డేటాకార్డ్ పై మార్కెట్లో వాటి వేడి చర్చసాగుతోంది. ఈ డేటాకార్డ్, సిమ్‌‌కార్డ్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండటం పలువురుని ఆశ్చర్యచకితులను చేస్తుంది. మొబైల్  సిమ్‌కార్డును సపోర్ట్ చేసే మొదటి డేటా కార్డుగా లావా 730G గుర్తింపుతెచ్చుకుంది.

తొలత ఈ ఇంటర్నెట్ డాంగిల్‌ను మీ పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లోని యూఎస్బీ పోర్టుకు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. కేవలం 40 సెకన్ల వ్యవధిలో ఈ కనెక్టువిటీ ప్రక్రియ పూర్తువుతుంది. ఇంటర్నెట్ యాక్సిస్ పొందిన అనంతరం డేటా‌కార్డులో నిక్షిప్తం చేసిన సిమ్‌కార్డ్ సాయంతో కంప్యూటర్ నుంచే నేరుగా మొబైలింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

ఏ ఆపరేటర్‌కు సంబంధించిన సిమ్ కార్డునైనా ఈ డాంగిల్ సపోర్ట్ చేస్తుంది. లావా 730జి 3జీ డేటాకార్డ్ ఇంటర్నెట్ వేగం 7.2ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. 32జీబి ఎస్డీ కార్డ్‌ను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ధర రూ.1650.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot