Home
News

రూ.9999 ధరకే 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. Lava Blaze 2 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక ప్యానల్‌ ప్రీమియం గ్లాస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ మెరుగైన ఫొటోగ్రఫీ అనుభవాన్ని కలిగిస్తుందని తెలుస్తోంది. ఈ లావా కొత్త ఫోన్‌ మూడు రంగుల్లో లభిస్తుంది.

లావా బ్లేజ్‌ 2 5G స్పెసిఫికేషన్లు : లావా బ్లేజ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ IPS పంచ్‌ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ మీడియోటెక్‌ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంది. క్లీన్‌ ఆండ్రాయిడ్‌ అందిస్తుందని తెలుస్తోంది.

Lava Blaze 2 5G launched in india

లావా బ్లేజ్‌ 2 5G ర్యామ్‌, స్టోరేజీ : లావా కొత్త ఫోన్‌ రెండు ర్యామ్‌, స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ సైడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆటో కాల్ రికార్డింగ్‌ ఫీచర్‌తో వస్తుంది.

5000mAh బ్యాటరీ : రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌ సహా ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రేడ్‌ ఇస్తామని లావా సంస్థ చెబుతోంది. ఈ లావా బ్లేజ్ 2 5G 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

Lava Blaze 2 5G launched in india

ఈ ఫోన్‌ ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు అనేక ఫీచర్లను కలిగి ఉంటాయి. టైమ్‌ ల్యాప్స్‌, UHD, GIF, బ్యూటి, HDR, పోట్రాయిట్‌, AI, ప్రో, పనోరమ, ఫిల్టర్‌, ఇంటెలిజెంట్‌ స్కానింగ్‌ సహా మరికొన్ని ఫీచర్లను కలిగి ఉన్నాయి.

లావా బ్లేజ్‌ 2 5G ధర, సేల్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ ధర రూ.9999గా ఉంది. అదే 6GB ర్యామ్‌+ 128GB వేరియంట్ ధర రూ.10999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌ 9 నుంచి లావా రిటైల్‌ స్టోర్‌, అమెజాన్, లావామొబైల్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నాయి. గ్లాస్‌ బ్లాక్, గ్లాస్‌ బ్లూ, గ్లాస్‌ లావెండర్‌ రంగుల్లో లభిస్తుంది.

పండుగ సీజన్‌ను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు అనేక స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కొత్త హ్యాండ్‌సెట్‌లను విడుదల చేస్తున్నాయి. దాంతోపాటు అనేక సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు సహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలు కూడా అనేక డిజిటల్‌ సహా గృహోపకరణాలపై భారీ తగ్గింపును ప్రకటిస్తున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze 2 5G Smartphone launched in india at RS9999 starting price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X