Home
News

లావా బ్లెజ్ 2 డిజైన్ మరియు ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు లీక్! ధర?

By Maheswara

లావా సంస్థ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్ 2 త్వరలోనే భారతదేశంలో లాంచ్ కాబోతోందని భావిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 2022 లో లాంచ్ అయిన లవ బ్లెజ్ 5G పరికరానికి ఇది కొనసాగింపు గా వస్తుంది. ఈ పరికరం ఇటీవల గీక్ బెంచ్ లో గుర్తించబడింది, ఇది రాబోయే స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను సూచించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లాంచ్ చేయబడుతుందని అంచనా వేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇప్పుడు వచ్చిన కొత్త లీక్‌ లు, లావా బ్లేజ్ 2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లను సూచిస్తుంది మరియు దాని డిజైన్ రెండర్‌లను కూడా సూచిస్తుంది. ఈ ఫోన్ ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేయబడుతుందని మరియు మూడు రంగుల ఎంపికలలో వస్తుందని తెలుస్తోంది.

Lava Blaze 2 Design Renders Leaked, Expected To Launch Soon In India. Expected Price And Specifications

భారతదేశంలో లావా బ్లేజ్ 2 అంచనా ధర వివరాలు,
విశ్వసనీయ లీక్ స్టార్ అయిన టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@స్టఫ్‌లిస్టింగ్స్) ఏప్రిల్‌లో లాంచ్ కానున్న ఈ లావా బ్లేజ్ 2 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లను ట్వీట్‌లో సూచించారు. 5GB వర్చువల్ RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్‌తో 6GB RAM యొక్క ఒకే కాన్ఫిగరేషన్‌లో ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ చేయబడుతుందని లీక్ సూచిస్తుంది. గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లాక్ మరియు గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందించబడిన లావా బ్లేజ్ 2 ధర రూ.10,000 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది.

లావా బ్లేజ్ 2 అంచనా స్పెసిఫికేషన్‌ల వివరాలు,
లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యూనిసోక్ T616 SoC ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 12తో వస్తుందని భావిస్తున్నారు.

ఈ లీక్‌ సమాచారం ప్రకారం, ఫోన్ యొక్క డిజైన్ రెండర్‌లు లావా బ్లేజ్ 2 యొక్క డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు వెనుక ప్యానెల్‌కు ఎగువ ఎడమ వైపు నిలువుగా అమర్చబడిన రెండు వృత్తాకార మాడ్యూల్స్‌లో ఉంచాలని సూచిస్తున్నాయి. ఫోన్ యొక్క వెనక కెమెరాలలో 13 మెగాపిక్సెల్ మరియు AI మద్దతు ఉన్న లెన్స్ ఉన్నాయి. ఊహించిన 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డిస్ప్లే ఎగువన కేంద్రీకృత రంధ్రం పంచ్ స్లాట్‌లో కనిపిస్తుంది.

ఈ ఫోన్ AnTuTu స్కోర్ 250,000+తో, లవ బ్లెజ్ 2 స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ USB-టైప్ C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌తో కూడా వస్తుంది. 203 గ్రాముల బరువున్న ఈ పరికరం పరిమాణం 16.5cm x 7.6cm x 0.9cm ఉంటుంది.

గతం లో లాంచ్ అయిన, లావా బ్లెజ్ 5G స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది 6.51-అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ Widevine L1 మద్దతును అందిస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌తో 7nm MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని పొందుతుంది.

Best Mobiles in India

English summary
Lava Blaze 2 Design Renders Leaked, Expected To Launch Soon In India. Expected Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X