Home
News

5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల లావా స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది.. సేల్‌ వివరాలు..!

లావా సంస్థ భారత్‌లో ఇటీవల లావా బ్లేజ్‌ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ను (Lava Blaze Curve 5G Smartphone Sale) విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యం సహా 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

లావా బ్లే్జ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18,999 గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా ఇ-స్టోర్‌, అమెజాన్‌ సహా ఇతర లావా ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze Curve 5G Smartphone Sale is live now

ఈ సేల్‌లో భాగంగా లావా కీలక ప్రకటన చేసింది. సంవత్సరం పాటు వారంటీ ఉంటుందని.. ఈ సమయంలో లావా బ్లేజ్‌ కర్వ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు హోమ్‌ రిపేర్‌ సర్వీస్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఫోన్ ఫోన్ కర్వడ్‌ డిస్‌ప్లే సహా డాల్బీ అట్మాస్‌ సపోర్టును కలిగి ఉంది.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్లతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని లావా సంస్థ హామీ ఇచ్చింది. ఈ OS బ్లోట్‌వేర్‌-ఫ్రీ మరియు యాడ్‌- ఫ్రీ UI ను కలిగి ఉంటుంది.

Lava Blaze Curve 5G Smartphone Sale is live now

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. ఈ చిప్‌ 8GB LPDDR5 ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు వీలుగా అదనంగా 8GB వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా విస్తరించవచ్చు.

లావా బ్రేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాలను కలిగి ఉంటుంది.

ఈ కొత్త లావా స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పూర్తి సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా ఒక రోజుపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుందని పేర్కొంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Curve 5G Smartphone Sale is live now here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X