ఇండియాలో 800 కోట్లు పెట్టుబడులు పెడుతున్న Lava.. మరిన్ని జాబ్ అవకాశాలు

|

చైనా దేశం ప్రపంచం మొత్తానికి కరోనా వైరస్ ను వ్యాప్తి చేసినందుకు గాను ఇప్పుడు చాలా పరిణామాలను ఎదురుకొంటున్నది. ఇప్పటికే ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడి "లోకల్ కే లియల్ వోకల్ కాల్‌కు" మద్దతు ఇవ్వాలని అందరిని కోరాడు.

దేశీయ బ్రాండ్ లావా

దేశీయ బ్రాండ్ లావా

దీనికి ప్రేరణగా ప్రముఖ దేశీయ బ్రాండ్ లావా సంస్థ తన మొత్తం మొబైల్ R&D, డిజైన్, మరియు మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ ఎగుమతులను చైనా నుంచి భారత్‌కు వచ్చే ఆరు నెలల్లోగా మార్చనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ 6నెలల నిర్ణీత సమయంలో మొత్తంగా ₹ 800 కోట్లు పెట్టుబడిని కూడా ఇండియాలో పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా లావా సంస్థ ఈ సంవత్సరం సుమారు ₹ 80 కోట్లను ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నది. అలాగే తరువాత ఐదేళ్ళలో సుమారు 800 కోట్లను ఇండియాలో పెట్టుబడిగా పెట్టనుంది.

 

 Airtel,Jio,BSNL,Vodafon వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే... Airtel,Jio,BSNL,Vodafon వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే...

దేశీయ మొబైల్ బ్రాండ్ లావా ఉత్పత్తి

దేశీయ మొబైల్ బ్రాండ్ లావా ఉత్పత్తి

లావా సంస్థ తయారుచేస్తున్న తన ఫోన్‌లలో 33% పైగా మెక్సికో, ఆఫ్రికా, ఆగ్నేయాసియా మరియు పశ్చిమ ఆసియా వంటి మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. దేశీయ మొబైల్ బ్రాండ్ లావా గత వారం నోయిడాలోని దాని తయారీ కేంద్రంలో 20% ఉత్పత్తి సామర్థ్యంతో తన ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది.

లావా సంస్థ వ్యూహం

లావా సంస్థ వ్యూహం

లావా సంస్థకు రాష్ట్ర అధికారుల ఆమోదం ఇచ్చిన తరువాత 3,000 మంది ఉద్యోగులలో సుమారు 600 మంది ఉద్యోగులు ఇప్పుడు తిరిగి తమ విధులలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. లావా ప్రస్తుతం దాని ఎగుమతుల కోసం రెండు వైపుల వ్యూహాన్ని అనుసరిస్తుంది. అందులో ఒకటి దాని బ్రాండ్ పేరుతో ఫోన్‌లను అమ్మడం మరియు మరొకటి ఎలక్ట్రానిక్ కంపెనీల కోసం ఉత్పత్తులను తయారు చేయడం లేదా అనుకూలీకరించడం.

ప్రభుత్వం PLI పథకం

ప్రభుత్వం PLI పథకం

గత నెలలో ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం (PLI) పథకం నుండి చైనా కంటే భారతీయ మొబైల్ ఫోన్ తయారీదారులు గణనీయమైన వ్యయ ప్రయోజనాన్ని పొందిన తరువాత ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "మా మొత్తం మొబైల్ ఆర్ అండ్ డి, డిజైన్ మరియు తయారీని చైనా నుండి భారతదేశానికి మార్చడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము" అని లావా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హరి ఓం రాయ్ చెప్పారు.

PLI పథకం వ్యూహాలు

PLI పథకం వ్యూహాలు

PLI పథకం కింద భారతదేశంలో తయారైన మరియు లక్ష్య విభాగాల పరిధిలో అర్హత కలిగిన సంస్థలకు ఐదేళ్ల కాలంలో బేస్ ఇయర్ తరువాత నిర్వచించిన విధంగా పెరుగుతున్న అమ్మకాలపై (బేస్ సంవత్సరానికి పైగా) 4% నుండి 6% వరకు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దేశీయ ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీ రంగం మిగిలిన దేశాలకు పోటీని ఇవ్వడానికి ప్రభుత్వం PLI పథకాన్ని ప్రారంభించింది.

MeitY

MeitY

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రకారం తగినంత మౌలిక సదుపాయాలు, దేశీయ సరఫరా చైన్ మరియు లాజిస్టిక్స్ లేకపోవడం వల్ల ఈ రంగం సుమారు 8.5% నుండి 11% వరకు నష్టాన్ని ఎదుర్కొంటుంది. అలాగే అధిక ఆర్థిక ఖర్చు, నాణ్యమైన సరఫరా లభ్యత, పరిమిత డిజైన్ సామర్థ్యాలు మరియు పరిశ్రమల ద్వారా R&D పై దృష్టి పెట్టడం మరియు నైపుణ్యం లేకపోవడం అనేవి అభివృద్ధిలో లోపాలకు గల కారణాలు.

Best Mobiles in India

English summary
Lava Company Investing 800 Crores in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X