Home
News

‘Made in India’ ఫీచర్ తో 5 కొత్త ఫోన్‌లను లాంచ్ చేయనున్న LAVA

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ లావా ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నది. ఈ లాంచ్‌ యొక్క ఈవెంట్ కార్యక్రమాన్ని జనవరి 7 న జరపాలని లావా సంస్థ ఇప్పటికే ఆహ్వానాలను పంపింది. ఈ భారతీయ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ గత వారం నుండి ఈ లాంచ్ గురించి టీజ్ చేస్తోంది. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన డైనమిక్ ఇంజనీరింగ్ ఫీచర్లను కలిగి ఉంటాయని అధికారికంగా వెల్లడించింది. మహిళా కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన లావా బీయూ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. జనవరిలో లావా బీయూతో సహా మొత్తం ఐదు ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు లావా సంస్థ ధృవీకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ లైవ్‌స్ట్రీమ్ వివరాలు

లావా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ లైవ్‌స్ట్రీమ్ వివరాలు

భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ట్వీట్ ప్రకారం జనవరి 7న మధ్యాహ్నం 12 గంటలకు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమం సంస్థ యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ హ్యాండిల్స్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఈ ట్వీట్‌లో #AbDuniyaDekhegi మరియు #ProudlyIndian హ్యాష్‌ట్యాగ్‌లు కూడా వరుసగా ఉన్నాయి. ఇవి ‘ఎవాల్వ్డ్ అండ్ డైనమిక్ ఇంజనీరింగ్' మరియు ‘మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్‌ఫోన్‌ల గురించి సూచించాయి.

Lava BeU ధరలు & స్పెసిఫికేషన్స్

Lava BeU ధరలు & స్పెసిఫికేషన్స్

లావా బీయూ యొక్క కొత్త ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A SoC మరియు IMG8322 GPU ప్రొసెసర్లు ఉన్నాయి. అలాగే ఇది SC9863A మీడియాటెక్ హెలియో P22 మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 లతో వచ్చే అవకాశం ఉంది. లావా బీ యు 6 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి ప్యానల్‌, 4,000mAh బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉండి రూ.6,888 ధర వద్ద విడుదల అయ్యే అవకాశం ఉంది.

LAVA 5 కొత్త ఫోన్‌ల ధరల వివరాలు

LAVA 5 కొత్త ఫోన్‌ల ధరల వివరాలు

లావా బీయూతో పాటు జనవరి 7 న మరొక నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మరియు మరొక స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరలు రూ.5,000 మరియు రూ.15,000 ధరల మధ్య ఉండే అవకాశం ఉంది. వీటిని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
LAVA Company Plan to Launch 5 New Smartphones on January 7 With ‘Made in India’ Feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X