Lava Education సిరీస్ టాబ్లెట్లు లాంచ్ అయ్యాయి!! మెరుగైన ఫీచర్లతో అందుబాటు ధరలోనే
భారతీయ మొబైల్ బ్రాండ్ లావా సంస్థ టాబ్లెట్లను తయారు చేయడంతో తన యొక్క ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ కంపెనీ ఇప్పుడు లావా మాగ్నమ్ XL, లావా ఆరా మరియు లావా ఐవరీ పేర్లతో టాబ్లెట్లను విడుదల చేసింది. ఈ కొత్త టాబ్లెట్ డివైస్లు మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో లభిస్తాయి. ఇవి ముఖ్యంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అందుబాటు ధరలోనే విడుదల కానున్నాయి. ఈ టాబ్లెట్ సిరీస్ లను కొనుగోలు చేసిన వారికి లావా సంస్థ కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తుంది. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే లావా టాబ్లెట్ సిరీస్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

లావా టాబ్లెట్ సిరీస్ ధరల వివరాలు
లావా సంస్థ విడుదల చేసిన టాబ్లెట్లలో లావా మాగ్నమ్ XL యొక్క ధర రూ.15,499 ను కలిగి ఉంది. అలాగే లావా ఆరా టాబ్లెట్ యొక్క ధర రూ.12,999 ను కలిగి ఉంది. మరోవైపు లావా ఐవరీ కేవలం రూ.9,499 ధర వద్ద విడుదల అయింది. ఇవి ఈ రోజు నుండి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ యొక్క వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

లావా మాగ్నమ్ XL టాబ్లెట్ స్పెసిఫికేషన్స్
లావా మాగ్నమ్ XL టాబ్లెట్ 10.1-అంగుళాల IPS ఎల్‌సిడి స్క్రీన్ తో 390 నిట్స్ ప్రకాశంతో ఉంటుంది. ఈ టాబ్లెట్ 6,100 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ టాబ్లెట్ యొక్క ముందు భాగంలో 2MP కెమెరాను కలిగి ఉండగా వెనుక భాగంలో 5 MP కెమెరాను కలిగి ఉంది. అలాగే ఈ టాబ్లెట్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన స్లాట్ 256GB వరకు మెమొరీని విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ 2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది డార్క్ గ్రే సింగిల్ కలర్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసింది.

లావా ఆరా టాబ్లెట్ స్పెసిఫికేషన్స్
లావా సంస్థ కొత్తగా విడుదల చేసిన టాబ్లెట్లోని లావా ఆరా టాబ్లెట్ 8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ 2GHz క్వాడ్-కోర్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతూ 5100mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ టాబ్లెట్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది కూడా 256GB వరకు మెమొరిని విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కెమెరా విభాగంలో 8 MP వెనుక కెమెరా మరియు 5 MP ముందు కెమెరాను కలిగి ఉంది.

లావా ఐవరీ టాబ్లెట్ స్పెసిఫికేషన్స్
లావా ఐవరీ టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ వెనుక భాగంలో టెక్స్ట్చర్డ్ హెయిర్ బ్రష్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ డివైస్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మరియు ఇది 256GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఈ టాబ్లెట్ వెనుక భాగంలో 5MP రియర్ కెమెరా మరియు ముందు భాగంలో 2MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








