Home
News

లావా బ్రాండ్ మొదటి 5G ఫోన్ లాంచ్!! టాప్ బ్రాండ్లకు దీటైన ఫీచర్లతో తక్కువ ధరలోనే

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ద్వారా లావా అగ్ని 5G పేరుతో తన యొక్క మొదటి 5G ఫోన్‌ను నేడు ఇండియాలో గ్రాండ్ గా లాంచ్ చేసింది. MediaTek Dimensity 810 SoCతో రన్ అవ్వడమే కాకుండా క్వాడ్ రియర్ కెమెరా మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు 90Hz డిస్‌ప్లేతో ఇతర టాప్ బ్రాండ్ ఫోన్లకు పోటీని అందిస్తున్నది. ఈ ఫోన్ యొక్క ఇతర ముఖ్యాంశాలలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 8GB RAM మరియు 10 ప్రీలోడెడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 5G ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Realme 8s 5G, మోటోG 5G మరియు Samsung Galaxy M32 5G వంటి వాటితో పోటీపడడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

లావా అగ్ని 5G ధరల వివరాలు

లావా అగ్ని 5G ధరల వివరాలు

భారతదేశంలో లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ యొక్క ధర రూ.19,999. ఈ ఫోన్ నవంబర్ 18 నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా దేశంలో మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి రానున్నది. అయితే ఇది నేటి నుండి అమెజాన్ మరియు లావా ఇ-స్టోర్ ద్వారా ప్రీ-బుకింగ్‌లకు అందుబాటులో ఉంటుంది. Lava Agni 5Gని ప్రీ-బుకింగ్ చేసుకునే కస్టమర్‌లు మొత్తం ధరలో రూ.500 చెల్లించిన వారికి రూ.2000 వరకు తగ్గింపును పొందేందుకు అర్హులు అవుతారు.

లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు హోల్-పంచ్ డిజైన్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 SoC ద్వారా శక్తిని పొందుతుంది.

ఆప్టిక్స్

లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.79 సిక్స్-పీస్ లెన్స్‌తో పాటు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. మిగిలిన కెమెరాలలో 5-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు వరుసగా ఉన్నాయి. ఇవి AI మోడ్, సూపర్ నైట్ మరియు ప్రో మోడ్‌తో సహా ప్రీలోడెడ్ కెమెరా మోడ్‌లను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం లావా అగ్ని 5G ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ

లావా అగ్ని 5G స్మార్ట్‌ఫోన్ 128GB UFS ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. లావా 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని అందించింది. లావా అగ్ని 5G దాని అంతర్నిర్మిత బ్యాటరీని 90 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఛార్జ్ చేస్తుందని పేర్కొంది.

Best Mobiles in India

English summary
Lava Launched First Agni 5G Smartphone With Similar Features to Those of The Top Brands
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X