Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
భారతదేశంలో Lava O2 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని లావా సంస్థ ధృవీకరించింది. ఈ ఫోన్ మార్చి 22న లాంచ్ అవుతుందని సంస్థ ప్రకటించింది. అంటే లాంచ్ కు మరి కొన్ని రోజులు మాత్రమే ఉంది.లాంచ్ వివరాలతో పాటు గా విడుదల చేసిన టీజర్ లో చిప్‌సెట్‌తో సహా పరికరం గురించి మరికొన్ని వివరాలను కూడా ప్రకటించారు.
Lava O2 లాంచ్ తేదీ వివరాలు మరియు టీజర్ వివరాలు
Lava O2 మార్చి 22న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం నుండి బ్రాండ్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఇప్పుడు అమెజాన్‌లో మైక్రోసైట్ లైవ్‌లో ఉన్నందున, ఈ ఫోన్ అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్ధారించబడింది.

లావా O2 స్మార్ట్ ఫోన్ మెజెస్టిక్ పర్పుల్ మరియు గ్రీన్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుందని ఈ అమెజాన్ మైక్రోసైట్ వెల్లడించింది. ఇది యూనిసోక్ T616 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ చిప్‌సెట్‌లో 2.0GHz వద్ద రెండు కార్టెక్స్ A75 కోర్లు, 1.8GHz వద్ద ఆరు కార్టెక్స్ A55 కోర్లు మరియు మాలి G57 MP1 GPU ఉన్నాయి. AnTuTu V10 బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో స్మార్ట్‌ఫోన్ 2,80,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని టీజర్ లో తెలియచేస్తున్నారు.
ఇక డిజైన్ మరియు స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే, సెల్ఫీ కెమెరాను ఉంచడానికి పరికరం కేంద్రీకృతమైన పంచ్ హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుందని మునుపటి టీజర్ ధృవీకరించింది. అలాగే, వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరాతో సహా రెండు కెమెరాల కోసం పెద్ద కెమెరా హౌసింగ్‌లు ఉంటాయి. ఈ పరికరం యొక్క కుడి వైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ పరికరం దిగువన ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌కు మద్దతు ఇస్తుందని ధృవీకరించబడింది.
Lava O2 స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్ల వివరాలు
అమెజాన్‌లో లైవ్ లో ఉంచిన ఈ స్మార్ట్‌ఫోన్ జాబితా, ఇప్పుడు తీసివేయబడింది.ఈ పరికరం యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. అమెజాన్ లో ఉంచిన జాబితా ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, LPDDR4X RAM మరియు UFS 2.2 స్టోరేజ్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కు సంబందించిన పూర్తి వివరాలు మార్చి 22 లాంచ్‌లో వెల్లడి చేయబడతాయి, కాబట్టి, మరింత సమాచారం కోసం వేచి ఉండండి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి.


Click it and Unblock the Notifications








