రూ.1299 ధరకే 40 గంటల బ్యాటరీ లైఫ్, ANC, ENC ఫీచర్‌లో నెక్‌బ్యాండ్.. సేల్!
లావా సంస్థ భారత్ మార్కెట్ లో ఇటీవలే లావా షార్క్ 2 స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రూ.6999 ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా లావా నెక్‌బ్యాండ్ ను విడుదల చేసింది. ANC ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. తక్కువ ధరలోనే తీసుకొచ్చింది. లావా ప్రోబడ్స్ N33 నెక్‌బ్యాండ్ పేరుతో విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, ధర వివరాలు.
లావా ప్రోబడ్స్ N33 నెక్‌బ్యాండ్ సౌకర్యంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. మెరుగైన పనితీరును కూడా అందిస్తుందని చెబుతోంది. ఈ నెక్‌బ్యాండ్ మెటాలిక్ ఫినిష్ తో అందుబాటులోకి వచ్చింది. మరియు డిజైన్ పరంగానూ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

లావా నెక్‌బ్యాండ్ 13mm డైనమిక్ బాస్ డ్రైవర్లను కలిగి ఉంది. ఈ నెక్‌బ్యాండ్ డీప్ బాస్ తో (Deep Bass) కూడిన మెరుగైన ఆడియోను అందిస్తుందని చెబుతోంది. కాలింగ్, మ్యూజిక్, గేమింగ్ సమయాల్లో సౌకర్యంగా వినియోగించుకోవచ్చని లావా చెబుతోంది.
లావా ప్రోబడ్స్ N33 ఇయర్‌బడ్స్ 30dB ANC ( యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ) ను సపోర్టును కలిగి ఉంది. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉంటుంది. దీంతోపాటు ENC ( ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ) ఫీచర్ కూడా ఉంది. కాలింగ్ సహా ఇతర సమయాల్లో ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి.
ప్రో గేమ్ మోడ్ :
గేమింగ్ సమయంలో ఈ నెక్‌బ్యాండ్ ప్రో గేమ్ మోడ్ (Pro Game Mode) పనితీరు ఆకట్టుకుంటుందని లావా చెబుతోంది. 45ms లో లేటెన్సీ ను అందిస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ మాగ్నటిక్ హాల్ స్విచ్ ను కలిగి ఉంటుంది. దీని ద్వారా సులభంగా పవర్ ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దీంతోపాటు మ్యూజిక్, కాల్స్, వాల్యూమ్ ను కంట్రోల్ చేయడానికి ప్రత్యేక బటన్ లు కలిగి ఉంటాయి.
3000mAh బ్యాటరీ :
లావా నెక్‌బ్యాండ్ 300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 40 గంటల వరకు ( ANC Off ) బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు. అదే ANC ఫీచర్ ను ఉపయోగిస్తుంటే, 30 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని లావా తెలిపింది.
ఈ ఇయర్‌బడ్స్ ను పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు సుమారు గంట సమయం పడుతుందని సంస్థ తెలిపింది. అయితే 10 నిమిషాల ఛార్జింగ్ తో 10 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ (Playback time) ను పొందవచ్చని చెబుతోంది.
నెక్‌బ్యాండ్ ధర, సేల్ వివరాలు :
లావా ప్రోబడ్స్ N33 నెక్‌బ్యాండ్ ధర రూ.1299 గా ఉంది. ప్రస్తుతం లావా అన్‌లైన్ స్టోర్ లు, రిటైల్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ ఒబ్సిడియన్ బ్లాక్, కాస్మిక్ టీల్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. డ్యూయల్ డివైజ్ పెయిరింగ్, బ్లూటూత్ 5.4 ఫీచర్ లను సపోర్టు చేస్తుంది. IPX5 రేటింగ్ తో చెమట, స్ల్పాష్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








