2వేల లోపు ధరలో ఫీచర్ ఫోన్ ను విడుదల చేసిన Lava కంపెనీ
ఇండియా యొక్క ఫోన్ మార్కెట్ లో మళ్ళి తన స్థానం సంపాదించుకోవడానికి లావా సంస్థ చాలా కృషి చేస్తున్నది. అందుకోసం ఇప్పుడు లావా సంస్థ కొత్తగా ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా పల్స్ పేరుతో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడి అతి తక్కువ ధరలో లభిస్తుంది. USPs, హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు సెన్సార్‌లను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫోన్ ఇదే కావడం మరొక గొప్ప విషయం అని కంపెనీ పేర్కొంది. లావా పల్స్ కొత్త ఫీచర్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

లావా పల్స్ ఫీచర్ ఫోన్ ధర మరియు లభ్యత
లావా పల్స్ ఫోన్ రూ.1,949 అతి తక్కువ ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ కేవలం రోజ్ గోల్డ్ కలర్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. దీనిని ఒక సంవత్సరం పూర్తి వారంటీతో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఇన్-బాక్స్ ఉపకరణాల మీద ఆరు నెలల మ్యానుఫ్యాక్చర్ వారంటీని కూడా సంస్థ అందిస్తోంది. భారతదేశంలోని అన్ని లావా సర్వీస్ కేంద్రంలోనైనా వీటిని కొనుగోలు చేయవచ్చు.

లావా పల్స్ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్
లావా కంపెనీ కొత్తగా విడుదల చేసిన పల్స్ ఫీచర్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది పాలికార్బోనేట్ బాడీను కలిగి ఉండి 101 గ్రాముల బరువును కలిగి ఉంది. ఇది 2.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్పోర్టింగ్ QVGA రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 32MB ర్యామ్ మరియు 24MB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 32GB వరకు విస్తరించవచ్చు. ఇది సూపర్ బ్యాటరీ మోడ్‌తో 1,800 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

లావా పల్స్ ఫీచర్ ఫోన్ ఫోటోగ్రఫీ
లావా పల్స్ ఫీచర్ ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఇందులో 0.3MP మెయిన్ VGA కెమెరా ఉంది. వెనుక కెమెరాను ఉపయోగించి వీడియో రికార్డింగ్ కూడా సులభంగా చేయవచ్చు. ఫ్లాష్‌లైట్, రికార్డింగ్ సామర్థ్యాలతో పాటు వైర్‌లెస్ FM రేడియో, 3.5mm ఆడియో జాక్, MP3 సపోర్ట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ సిమ్ వంటి అనుకూలమైన ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది.

లావా పల్స్ ఫీచర్ ఫోన్ సెన్సార్ ఫీచర్స్
లావా పల్స్ ఫీచర్ ఫోన్ రక్తపోటు మరియు హృదయ స్పందన పర్యవేక్షణ సెన్సార్‌లను కూడా ఉంటుంది. ఈ లక్షణాలను ఉపయోగించడానికి వినియోగదారులు తమ యొక్క వేళ్లను ‘పల్స్ స్కానర్'పై ఉంచాలి. ఇది రక్తపోటు మరియు హృదయ స్పందన కొలతలను తక్షణమే స్క్రీన్ మీద చూపుతుంది. ఫోల్డర్ మరియు నంబర్ టాకర్ లోపల ఆటో కాల్ రికార్డింగ్‌కు ఫోన్ మద్దతు ఇస్తుంది. అదనంగా ఇది ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, గుజరాతీ మరియు పంజాబీలతో సహా ఏడు భాషలలో టైప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.


Click it and Unblock the Notifications








