8GB ర్యామ్, 16MP సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ ఆఫర్.. జనవరి 10 వరకు మాత్రమే డిస్కౌంట్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా కొన్ని నెలల క్రితం లావా అగ్ని 2 5G స్మార్ట్‌ఫోన్‌ను ( Lava Agni 2 5g ) లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. లావా ఇయర్ ఎండ్ సేల్‌లో (Lava year End Sale ) భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉత్తమ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను ప్రకటించింది.
రూ.15000 నుంచి రూ.20000 ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకొంటే లావా అగ్ని 2 ఉత్తమ ఎంపిక కానుంది. ప్రస్తుతం ఈ లావా స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీ అమెజాన్‌లో రూ.19999 కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ వెరీడియన్, గ్లాస్ ఐరన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే : అమెజాన్ ఫ్లాట్‌ఫాంలో వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు EMI లావాదేవీ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1200 తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.3500 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 10 వరకు ఉంది.
లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు : ఈ లావా హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల పుల్ హెచ్‌డీ+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 129Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 950 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 6nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 CPU ప్రాసెసర్‌తో వస్తుంది.

ఛార్జింగ్ మరియు బ్యాటరీ సామర్థ్యం : ఈ లావా అగ్ని 2 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఓఎస్‌ను కలిగి ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 14 మరియు ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్లను పొందనుందని లావా సంస్థ తెలిపింది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 66W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
50MP ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా : కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 8MP అల్ర్టావైడ్ లెన్స్, 2MP మాక్రో డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను అమర్చారు.
కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.2, USB-C ఛార్జింగ్ పోర్టు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రానుంది. రూ.15000 నుంచి రూ.20000 ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకొంటే లావా అగ్ని 2 ఉత్తమ ఎంపిక కానుంది. ఈ ఆఫర్ జనవరి 10 వరకు మాత్రమే ఉంటుందని సంస్థ వెల్లడించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








