Home
News

Lava Z2 Max ఫోన్ 6,000mAh పెద్ద బ్యాటరీతో విడుదలైంది!! బడ్జెట్ ధరలోనే...

ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన వనిల్లా లావా జెడ్ 2కి అప్ గ్రేడ్ వెర్షన్ గా లావా Z2 మాక్స్ ఫోన్ ను నేడు భారతదేశంలో లాంచ్ చేసారు. ప్రస్తుత కరోనా సమయంలో విద్యార్థులు ఇంటికి పరిమితమయి ఆన్‌లైన్ పద్దతిలో ఇ-లెర్నింగ్‌ ద్వారా తరగతులను వింటున్న వారిని లక్ష్యముగా చేసుకొని పెద్ద డిస్ప్లే మరియు పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లతో లావా Z2 మాక్స్ ను విడుదల చేసారు. మీడియాటెక్ SoC చేత రన్ అవుతూ 4G VoLTE మద్దతును కలిగి ఉండి వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు సెల్ఫీ షూటర్ కోసం డిస్ప్లేలో ప్రత్యేకమైన నాచ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

లావా Z2 మాక్స్ ధరల వివరాలు

లావా Z2 మాక్స్ ధరల వివరాలు

లావా Z2 మాక్స్ స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే ఒక సింగిల్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లాంచ్ అయింది. 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్‌తో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.7,799. ఇది స్ట్రోక్డ్ బ్లూ మరియు స్ట్రోక్డ్ సియాన్ కలర్ ఆప్షన్‌లో అందించబడుతుంది. దీనిని లావా వెబ్‌సైట్, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

లావా Z2 మాక్స్ స్పెసిఫికేషన్స్

లావా Z2 మాక్స్ స్పెసిఫికేషన్స్

లావా జెడ్ 2 మాక్స్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) ద్వారా రన్ అవుతుంది. ఇది 258pp పిక్సెల్ సాంద్రత, 720x1,640 పిక్సెల్స్, 20.5: 9 కారక నిష్పత్తి మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 7-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. హుడ్ కింద ఈ ఫోన్ 2GB DDR4X RAM మరియు 32GB స్టోరేజ్ ను కలిగి ఉండి క్వాడ్ కోర్ మీడియాటెక్ హెలియో SoC చేత జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు.

ఫోటోగ్రఫి

లావా జెడ్ 2 మాక్స్ యొక్క ఫోటోగ్రఫి విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.85 లెన్స్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

లావా జెడ్ 2 మాక్స్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్ వై-ఫై, 4G వోల్టిఇ, బ్లూటూత్ V5, జిపిఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో వస్తుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, సామీప్య సెన్సార్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. లావా ప్రకారం భారీ 6,000mAh బ్యాటరీని కేవలం 3 గంటల 47 నిమిషాల్లో ఛార్జ్ చేయడానికి మద్దతును కలిగి ఉంది. ఇది ఒక ఛార్జ్ మీద 9 గంటల 8 నిమిషాల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదు. ఈ ఫోన్ 174.7x78.6x9.05mm కొలతల పరిమాణంలో ఉండి 216 గ్రాముల బరువుతో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Z2 Max Released in India With 7-Inch Display and 6,000mAh Battery: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X