Lava Z61 Pro Price and Specs:Rs.6,000 ధర లోపే లావా కొత్త ఫోన్!!! ఫీచర్స్ అదుర్స్
ఇండియా బోర్డర్ గాల్వన్ ఘటన తరువాత ఇండియాలో చైనా యొక్క ఉత్పత్తుల మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటికే చైనా యొక్క 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేదించింది. ఈ ప్రభావం చైనా యొక్క స్మార్ట్ ఫోన్ల మీద పడనున్నది. దీనిని అందిపుచ్చుకోవడానికి ఇండియా సంస్థలు వేగంగా అడుగులు వేస్తున్నాయి.

లావా Z61 ప్రో బడ్జెట్ ఫోన్ లాంచ్
అందులో భాగంగా ప్రముఖ లావా కంపెనీ తన ఉత్పతుల పోర్ట్‌ఫోలియోను దేశంలో విస్తరిస్తూ లావా Z61 ప్రోను ఇండియాలో లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో విడుదల అయిన ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి.

లావా Z61 ప్రో ఫోన్ ధరల వివరాలు
లావా Z61 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లలో విడుదల అయింది. 2GB ర్యామ్ + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ లలో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.5,774. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లూ మరియు అంబర్ రెడ్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లలో వారంలోపు లభిస్తుందని లావా సంస్థ తెలిపింది.

లావా Z61 ప్రో స్పెసిఫికేషన్స్
లావా Z61 ప్రో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ ఎంపికతో వస్తుంది. ఇది 5.45-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే 18: 9 యొక్క కారక నిష్పత్తితో వస్తూ ఎగువ మరియు దిగువ భాగాలలో సాంప్రదాయ బెజెల్స్ నిర్మాణంను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 128GB వరకు విస్తరించడానికి మద్దతు ఇస్తుంది.

లావా Z61 ప్రో కెమెరా సెటప్
లావా Z61 ప్రో ఫోన్ యొక్క కెమెరాల విషయానికొస్తే దీని వెనుక భాగంలో నిలువుగా క్యాప్సూల్ లాంటి కెమెరా మాడ్యూల్ కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సింగల్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం డిస్ప్లే యొక్క బెజెల్ లోపల 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీని యొక్క కెమెరా ఫీచర్లలో పోర్ట్రెయిట్ మోడ్ (బోకె), బరస్ట్ మోడ్, పనోరమా, ఫిల్టర్లు, బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్ మరియు నైట్ మోడ్ వంటివి ఉన్నాయి.

లావా Z61 ప్రో కనెక్టివిటీ
లావా Z61 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది బ్లూటూత్ 4.2, వై-ఫై, GPS , USB ఓటిజి సపోర్ట్ మరియు మైక్రో-USB పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించదు. అయితే ఇది భద్రత కోసం ఫేస్ అన్‌లాక్‌కు మద్దతుతో వస్తుంది. అలాగే ఇది 3,100mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








