Just In
- 11 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 13 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 16 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 18 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
వీడియో స్ట్రీమింగ్ కోసం ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్న YouTube
ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలో పనిచేసే వీడియో యాప్ యూట్యూబ్ తన యొక్క వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికను వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో పాల్గొనడం గురించి కంపెనీ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో మరిన్ని చర్చలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ఇది అంతర్గతంగా "ఛానల్ స్టోర్"గా సూచించబడుతోంది అని ఇటీవల చర్చలలో పాల్గొన్న దగ్గర వ్యక్తుల నుంచి విషయం లీక్ అయింది అని నివేదిక పేర్కొంది. ఈ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి దశలో ఉన్నందున అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలలు సమయం పట్టవచ్చు అని నివేదికలు చూపుతున్నాయి.

ఆన్‌లైన్ లో వచ్చిన ఈ నివేదికలను దృష్టిలో ఉంచుకొని రాయిటర్స్ చేసిన అభ్యర్థనకు ఆల్ఫాబెట్ స్పందించలేదు. ఎక్కువ మంది వినియోగదారులు కేబుల్ లేదా శాటిలైట్ టీవీ వంటి సబ్స్క్రిప్షన్లను కత్తిరించి సబ్‌స్క్రిప్షన్-ఆధారిత స్ట్రీమింగ్ సేవలకు మారడంతో యూట్యూబ్ కూడా ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే రద్దీగా ఉన్న ఆన్‌లైన్ స్ట్రీమింగ్ మార్కెట్‌లో కొంత భాగాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్ Roku Inc మరియు ఆపిల్ వంటి కంపెనీలలో చేరడానికి ప్రణాళికాబద్ధమైన ప్రారంభం అనుమతిస్తుంది. ఈ వారం ప్రారంభంలో వాల్‌మార్ట్ Inc తన సబ్‌స్క్రిప్షన్ సర్వీసులో స్ట్రీమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేర్చడం గురించి మీడియా కంపెనీలతో చర్చలు జరిపిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవడం
* యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవడం చాలా సులువైన ప్రక్రియ. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ Gmail సహాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి.
* యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు పలు రకాల ఆప్షన్స్ కనబడతాయి. వాటిలోనే రెండో ఆప్షన్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.
* "Create a New Channel" ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో(బాక్స్) ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి. దాంతో పాటు ఛానెల్ ప్రొఫైల్ పిక్చర్ ను అక్కడే అప్‌లోడ్ చేయండి. అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేషన్ అయిపోతుంది.
* ఆ తర్వాత మీ ఛానెల్‌లో పూర్తి వివరాలు, ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే వివరాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo ఇవ్వండి. అక్కడే మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి.
అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు.
* ఇక మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఇందుకోసం ఛానెల్‌లో కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు.

మీ Youtube ఛానల్ యొక్క కామెంట్ హిస్టరీని మొబైల్‌లో చూడడం ఎలా
స్టెప్ 1: మీ మొబైల్‌లో Youtube అప్లికేషన్ యాప్ ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: తరువాత మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి "యువర్ డేటా ఇన్ యూట్యూబ్" ఎంపిక కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అకౌంటుతో సైన్ ఇన్ చేయాలి.
స్టెప్ 5: మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు "మీ యూట్యూబ్ డ్యాష్‌బోర్డ్" విభాగంలో కామెంట్స్ అనే ఎంపిక కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 6: ఇప్పుడు మీరు వీక్షించిన యూట్యూబ్ వీడియోలకు వచ్చిన కామెంట్లను వీక్షించవచ్చు మరియు సవరించవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470