టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

|

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఐటీ విభాగంలోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఐటీ విభాగంలో ప్రముఖ స్థానాల్లో కొనసాగుతూ నేటి ఆధునిక మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ఐదుగురు మహిళామణులను మీకు పరిచయం చేయబోతున్నాం.

ఓ సంస్థకు సీఈవో స్థానంలో కొనసాగాలంటే సదరు రంగంలో ప్రావిణ్యాన్ని సంపాదించటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్కిల్స్ అలానే నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా అలవర్చుకోవల్సి ఉంటుంది.

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

లిండా డిమైచీల్ (Linda DeMichiel):

కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డిని పొందిన లిండా టెక్నాలజీ ప్రపంచలో అంచలంచెలుగా ఎదుగుతున్న మహిళలకు స్పూర్తిగా నిలిచారు. ఈమె జావా ఈఈ ప్లాట్‌ఫామ్ గ్రూప్‌లో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా కొనసాగుతున్నారు. ఓరాకిల్, జావా విభాగాల్లో లిండా డిమైచీల్ నిష్ణాతులు.

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

మారిస్సా మేయర్ (Marissa Mayer):

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ యాహూకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారిస్సా మేయర్ యువ సీఈవోగా రికార్డుల్లోనిలిచారు. ఈమె సింబాలిక్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీలను పొందారు. గూగుల్‌లో పని చేసిన తొలి మహిళా ఇంజనీర్ గా మారిస్సా గుర్తింపుపొందింది.

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

ఉర్సులా బర్న్స్ (Ursula Burns):

జిరాక్స్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా తన కేరీర్‌ను ప్రారంభించిన ఆఫ్రో-అమెరికన్ జాతీయరాలు ఉర్సులా బర్న్స్ 2009లో ఆ కంపెనీకి సీఈవోగా ఎంపికయ్యారు. 2010లో చైర్మన్‌గా నియమతులయ్యారు. 1992 నుంచి 2000 వరకు ఈమె వివిధ బిజినెస్ బృందాలను లీడ్ చేశారు. పాలిటెక్నిక్ అలానే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈమె ప్రావిణ్యాన్ని సాంపాదించారు.

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

జోసిలిన్ గోల్డ్‌ఫియన్(Jocelyn Goldfein):

ఫేస్‌బుక్‌లో డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న జోసిలిన్ గోల్డ్ ఫియన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను వృద్ధిచేయటంలో దిట్ట. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన జోసిలిన్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీని పొందారు.

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

టెక్ సెక్టార్‌లో రాణిస్తున్న ఉత్తమ మహిళలు

మారిస్సా మేయర్ (Marissa Mayer):

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ యాహూకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మారిస్సా మేయర్ యువ సీఈవోగా రికార్డుల్లోనిలిచారు. ఈమె సింబాలిక్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీలను పొందారు. గూగుల్‌లో పని చేసిన తొలి మహిళా ఇంజనీర్ గా మారిస్సా గుర్తింపుపొందింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X