ఇక ఏటిఎమ్ కార్డుల పనైపోయింది..

Posted By: Staff

ఇక ఏటిఎమ్ కార్డుల పనైపోయింది..

 

 

ఈ విషయం గనుక తెలుసుకుంటే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుందనండంలో ఎటువంటి సందేహాం లేదు. యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ కొత్తగా మార్కెట్లోకి తమయొక్క కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని ఓ అప్లికేషన్‌ని రూపొందించింది. ఈ అప్లికేషన్ వల్ల ఏటిఎమ్ కార్డు లేకుండానే డబ్బుని ట్రాన్పర్ లేదా విత్ డ్రా చేయవచ్చు. ప్రపంచంలో ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి సింగపూర్ బ్యాంక్ యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని వినియోగించే కస్టమర్స్ ఎవరైతే ఎక్కువ మంది ఈ అప్లికేషన్‌లో రిజస్టర్ అవుతారో దానిని బట్టి ఈ అప్లికేషన్‌ని త్వరలో కస్టమర్స్ కోసం ఉపయోగించనున్నారు. సింగపూర్‌లో నివశిస్తున్న ఎక్కువ మంది కస్టమర్స్ ఆన్ లైన్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తున్న తరుణంలో ఇలాంటి అప్లికేషన్ వారికి ఉపయోగపడుతుందని దీనిని రూపొందించామన్నారు.

ఈ అప్లికేషన్‌ని రానున్న కాలంలో 'మనీ క్యాష్' గా అభివర్ణించనున్నారు. ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ వారియొక్క లిస్ట్‌లో యాడ్ చేసుకున్న కస్టమర్స్‌కి డబ్బుని ట్రాన్ఫర్ చేయవచ్చు. మీరు మనీ పంపాల్సిన కస్టమర్‌కి టెక్ట్స్ మేసేజ్ ద్వారా యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ అందించే పాస్ వర్డ్‌ని పంపితే చాలు మొత్తం సింగపూర్‌లో ఉన్న 600 ఏటియమ్ సెంటర్లలలో డబ్బుని డ్రా చేసుకోవచ్చు.

 

దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సింగపూర్‌లో మీకు దగ్గరలో ఉన్న యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద తెలుసుకొవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా కస్టమర్స్ ఫండ్ ట్రాన్పర్స్, పే బిల్స్, ఎకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడం మొదలగునవి చేయవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్‌లో బంగారం, వెండి ధరలను కూడా కస్టమర్స్‌కి తెలియజేయనుంది.

ప్రస్తుతానికి ఈ అప్లికేషన్‌ని ఆపిల్ స్మార్ట్ ఫోన్స్‌లో నిక్షిప్తం చేసేందుకు గాను ఆపిల్ స్టోర్స్‌లలో ఫ్రీగా అందిస్తుంది. వచ్చే సంవత్సరంలో ఈ అప్లికేషన్‌ని బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌కి అందించేందుకు సన్నాహాలు చేస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting