రికార్డులు తిరగరాస్తున్న LeEco సూపర్ టీవీలు..?

తన కంటెంట్ ఇంటిగ్రేటెడ్ ఇకోసిస్టం టీవీలతో ఇండియన్ టెలివిజన్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాందిపలికిన LeEco కు ఆన్ లైన్ షాపర్లు బ్రహ్మరథం పడుతున్నారు.

రికార్డులు తిరగరాస్తున్న LeEco సూపర్ టీవీలు..?

Super3 TV series నుంచి లీఇకో ఆఫర్ చేయబోతోన్న విప్లవాత్మక టీవీలకు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్ ఆగష్టు 26 మధ్యాహ్నం 12 గంటలకు జరగబోతోంది. LeMall.com అలానే Flipkart.comలు ఎక్సక్లూజివ్‌గా ఈ టీవీలను విక్రయించబోతున్నాయి. ఈ సేల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, మొదటిరోజే టీవీల కోసం 10,000 మంది రిజిస్టర్ అయ్యారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రత్యేకమైన రోడ్‌షోలు

LeEco తన కంటెంట్ ఇంటిగ్రేటెడ్ ఇకోసిస్టం టీవీలకు సంబంధించి యూజర్లకు ప్రత్యక్ష అనుభూతులను చేరువ చేసేందుకు LeEco పలు ప్రత్యేకమైన రోడ్‌షోలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నిర్వహించింది..

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ..

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో అభివృద్థి చేయబడిన ఈ సూపర్ టీవీలు కనీవినీ ఎరగని ప్రత్యేకతలతో అటు ధర పరంగా, ఇటు పనితీరు పరంగా ఎంతో ఆకట్టుకంటాయి. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అనేక కంపెనీలు వివిధ మోడల్స్‌లో టీవీలను ఆఫర్ చేస్తున్నాయి. కాలానుగుణంగా టెలివిజన్ వ్యవస్థలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు అనేక టీవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా చేసాయి.

లీఇకో అందిస్తోన్న టీవీల రేంజ్‌ను పరిశీలించినట్లయితే..

 సూపర్3మాక్స్65 (3డీ డిస్‌ప్లే సపోర్ట్), సూపర్3మాక్స్‌ఎక్స్65, సూపర్3మాక్స్‌ఎక్స్55. ఈ మూడు టీవీలు ఆగష్టు 4న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ టీవీలలో 4కే అల్ట్రా హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. తద్వారా, క్రిస్టల్ క్లియర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

లీఇకో eUI5.5 యూజర్ ఇంటర్‌ఫేస్‌ పై

లీఇకో eUI5.5 యూజర్ ఇంటర్‌ఫేస్‌ పై ఈ టీవీలు రన్ అవుతాయి. Levidi, LIVE, LeView, Panosearch వంటి కంటెంట్ వ్యూవింగ్ యాప్స్‌ను టీవీలలో ఇన్‌బుల్ట్‌గా నిక్షిప్తం చేసారు.

రెండు సంవత్సరాల ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌

సూపర్ 3 సిరీస్ టీవీల పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌ను లీఇకో ఆఫర్ చేస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ను పొందటం ద్వారా 2000 హైడెఫినిషన్ క్వాలిటీ సినిమాలతో పాటు 100కు పైగా శాటిలైట్ టీవీ ఛానళ్లు, 3.5 మిలియన్ల పాటలు, 50కు పైగా live concertsలను ఆస్వాదించవచ్చు. 5TB క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ధరలు..

LeEco Super3X55 మోడల్ ధర రూ.59,790. LeEco Super3 X65 మోడల్ ధర రూ.99,790. LeEco Super Max65 (3డీ డిస్ ప్లే) మోడల్ ధర రూ.1,49,790. వీటి కొనుగులు పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు.

ప్రొడక్ట్ వారంటీతో పాటు 4 సంవత్సరాల ప్యానల్ వారంటీ

ఈ టీవీల పై రెండు సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీతో పాటు 4 సంవత్సరాల ప్యానల్ వారంటీని లీఇకో ఆఫర్ చేస్తోంది. లీఇకో దేశవ్యాప్తంగా 333 సేల్ సర్వీస్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco garners a record 10,000 registrations for its EcoTVs on day 1. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot