4జీబి ర్యామ్‍‌తో ‘LeEco Le 2’

Written By:

చైనా ఫోన్ మేకర్ LeEco నుంచి త్వరలో విడుదల కాబోతున్న Le 2 స్మార్ట్‌ఫోన్‌‌కు సంబంధించి అనేక ఊహాగానాలు ఇంటర్నెట్‌‍లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లీ2 ఫోన్‌కు సంబంధించిన ఓ టీజర్ ఇమేజ్‌ను చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weiboలో లీఇకో లాంచ్ చేసింది.

 4జీబి ర్యామ్‍‌తో ‘LeEco Le 2’

Read More : సూపర్ ఛాన్స్... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

ఈ టీజర్ ప్రకారం లీ2 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ అల్ట్రా‌సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ సెన్స్ ఐడీ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటోన్న ఈ అల్ట్రా‌సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీ ఫింగర్ ప్రింట్ తడిగా లేదా మురికిగా ఉన్నప్పటికి అంగీకరిస్తుంది. రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం లీఇకో లీ2 ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు.

 4జీబి ర్యామ్‍‌తో ‘LeEco Le 2’

Read More : iPhone SE, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

క్వాడ్ - కోర్ 64 బిట్ చిప్‌సెట్ విత్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.8గిగాహెర్ట్జ్), మరో వేరియంట్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్, అడ్రినో 350 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, పూర్తి మెటల్ బాడీ, యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ, 4జీబి ర్యామ్, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి లీఇకో ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక సమాచారాన్ని వెలువరించలేదు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

 4జీబి ర్యామ్‍‌తో ‘LeEco Le 2’

Read More : మీ ఫోన్‌ని వైరస్ భారీ నుంచి కాపాడే యాప్స్..

లీఇకో బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలై అమ్మకాల సునామీని సృష్టిష్లోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ 'లీ 1ఎస్'సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ రికార్డులను బద్దలకొడుతూ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్‌ హోదాను దక్కించుకుంది. రూ.10,999 ధర ట్యాగ్‌లో లభ్యమవుతున్న ఈ స్థిరమైన సూపర్ ఫోన్ ప్రీమియమ్ టాప్ ఎండ్ ఫోన్‌లైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (ధర రూ.33,900), హెచ్‌టీసీ వన్ ఎమ్9+ (ధర రూ.41,000)లకు తన స్టన్నింగ్ డిజైన్ ఇంకా బెస్ట్ క్లాస్ టెక్నాలజీతో ఛాలెంజ్ విసురుతోంది. ట్రెండీ లుక్ ఇంకా పూర్తి మెటల్ బాడీతో విడుదలైన లీ 1ఎస్ ఫోన్‌లకు చైనా మార్కెట్లో బ్రహరథం పట్టారు. ఆక్టోబర్‌లో విడుదలైన Le 1s ఫోన్ రెండు నెలల వ్యవధిలోని 20 లక్షల కంటే ఎక్కువ ఫోన్‌లను విక్రయించి చైనా మార్కెట్లో టాప్ సెల్లర్‌గా నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

పూర్తి bezel-less మెటల్ డిజైన్‌తో వచ్చిన లీ 1ఎస్ ఫోన్ మొట్టమొదటి యునిబాడీ మెటల్ ఫోన్‌గా మార్కెట్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తరహా డిజైనింగ్ టాప్ ఎండ్ ఫోన్ లలో  మాత్రమే మనం చూడొచ్చు. 

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియమ్‌ పరిపూర్ణతతో కూడిన మెటల్ యుని-బాడీ డిజైనింగ్ Le 1sకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

స్ర్కూలెస్ ఇండస్ట్రీయల్ డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్న ఏకైక మెటల్ బాడీ ఫోన్‌లుగా LeEco సూపర్‌ఫోన్స్ గుర్తింపు తెచ్చుకున్నాయి.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఐఫోన్ 6ఎస్ ప్లస్ బరువుతో లీ 1ఎస్ బరువును పోల్చి చూసినట్లయితే లీ 1ఎస్ ఫోన్ ఐఫోన్ కంటే 23 గ్రాముల తక్కువ బరువును కలిగి ఉంటుంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

సిగ్నల్ ఫెర్మామెన్స్ విషయంలోనూ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను లీ 1ఎస్ ఫోన్ అధిగమించింది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ సిగ్నల్ ఫెర్మామెన్స్‌తో పోల్చి చూసినట్లయితే 2జీ, 3జీ నెట్‌వర్క్ పై 18 శాతం , 4జీ నెట్‌వర్క్ పై 24 శాతం, వైఫై నెట్‌వర్క్ పై 13 శాతం నాణ్యతలను లీ 1ఎస్ ఫోన్ కలిగి ఉంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

లీ 1ఎస్ ఫోన్ అనేక విశిష్టమైన ఫీచర్లతో వస్తోంది. ఈ బడ్జెట్ ప్రెండ్లీ ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ సిమ్ 4జీ వై-ఫై బ్యాండ్ ఫీచర్ కేవలం హెచ్‌టీసీ వన్ ఎమ్9+లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.41,000.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

లీ 1ఎస్ ఫోన్ శక్తివంతమైన ఆక్టా కోర్ 2.2గిగాహెర్ట్జ్ హీలియో ఎక్స్10 టర్బో ప్రాసెసర్‌తో వస్తోంది. హైఎండ్ సామ్‌సంగ్ , హెచ్‌టీసీ ఫోన్‌లలో పొందుపరిచిన క్వాడ్‌కోర్, మీడియాటెక్ చిప్‌సెట్‌లతో ఇది పోటీ పడగలదు.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఈ పవర్ హౌజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో పొందపరిచిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఇక బ్యాటరీ పవర్ విషయానికొస్తే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 (3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ), హెచ్‌టీసీ వన్ ఎమ్9+ (2840ఎమ్ఏహె బ్యాటరీ)లతో లీ 1ఎస్ ఫోన్ పోటీ పడుతోంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లో ఏర్పాటు చేసిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది.

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

లీ 1ఎస్ ఫోన్‌లో పొందుపరిచిన క్విక్ చార్జింగ్ టెక్నాలజీ 5 నిమిషాలకు 3.5 గంటల టాక్ టైమ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ చార్జింగ్ కోసం పరితపించే బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఈ సదుపాయం మరింతగా ఉపయోగపడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 2 to Feature 4GB RAM and Ultrasonic Fingerprint Sensor!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot