LeEco నుంచి కంటెంట్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టీవీలు

ఒకప్పుడు టెలివిజన్ సెట్‌లను 'ఇడియట్ బాక్స్'లుగా పలిచేవారు. ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అంటూ టెలివిజన్ పరిశ్రమ రూపురేఖలే మారిపోయాయి. శక్తివంతమైన వినోద సాధానల్లో ఒకటైన టెలివిజన్ ఇప్పుడు ప్రతి ఇంటికి తప్పనిసరైంది. కాలానుగుణంగా టెలివిజన్ వ్యవస్థలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు అనేక టీవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా చేసాయి.

LeEco నుంచి కంటెంట్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టీవీలు

సీఆర్‌టీ (కాథోడ్ రే ట్యూబ్)లకు భిన్నంగా ప్లాట్ ప్యానల్ డిస్‌ప్లే టెక్నాలజీతో ఎల్‌సీడీ ఇంకా హైడెఫినిషన్ టీవీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇవి డైరెక్ట్ వ్యూ టీవీలతో పోలిస్తే మరింత స్లిమ్‌గా ఉంటాయి. ఈ తరహా టీవీలు తక్కువ స్థలాన్ని ఆక్రమించటమే కాకుండా మెరుగైన దృశ్య నాణ్యతను అందిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

6Wresearch సంస్థ సర్వే ప్రకారం...

ఇటీవల కాలంలో స్మార్ట్ టెక్నాలజీతో వస్తోన్న టీవీలను మార్కెట్లో ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ కమ్యూనికేసన్ టెక్నాలజీతో వచ్చే టీవీలను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకుని వెబ్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. 6Wresearch సంస్థ సర్వే ప్రకారం భారత్‌లో స్మార్ట్ టీవీల మార్కెట్ 2017 నాటికి 54,000 కోట్లకు చేరుకోనుందట. ఇప్పటికే అనేక కంపెనీలు భారత్‌లో స్మార్ట్ టీవీలను విక్రయిస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండ్‌లు మాత్రమే పూర్తిస్థాయి స్మార్ట్ ఫీచర్లతో కూడిన టీవీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో LeEco అసలుసిసలైన స్మార్ట్ టీవీ టెక్నాలజీతో ముందుకురాబోతోంది.

స్మార్ట్‌ఫోన్‌‍ల వ్యాపారంతో..

ఈ ఏడాది ఆరంభంలో స్మార్ట్‌ఫోన్‌‍ల వ్యాపారంతో ఇండియన్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన LeEco కొన్ని నెలల వ్యవధిలోనే తనేంటో నిరూపించుకుంది. ప్రత్యేకమైన కంటెంట్ ఇకో ప్రోగ్రామ్‌‌తో ఈ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న సూపర్ ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ డిమాండ్ నెలకుంది. ఇండియన్ మార్కెట్లో పట్టుబిగించేందుకు మరో అడుగు ముందుకేసిన LeEco విప్లవాత్మక స్మార్ట్ టీవీలను పరిచయం చేయబోతోంది. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న LeEco స్మార్ట్ టీవీలు కనీవిని ఎరగని ఫీచర్లతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టనున్నాయట.

LeEco స్మార్ట్ టీవీలకు చైనాలో డిమాండ్

LeEco స్మార్ట్ టీవీలకు ఇప్పటికే చైనా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ నెలకుంది. ఎంటర్‌టైన్‌‍మెంట్ బండిల్డ్ ప్యాక్‌తో వచ్చే LeEco టీవీల ద్వారా నాన్‌స్టాప్ సినిమాలు, పాటలు, లైవ్ షోలు వీక్షించవచ్చు. కంటెంట్ ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తో వస్తోన్న లీఇకో స్మార్ట్ టీవీలు టెలివిజన్ ఎక్స్‌పీరియన్స్‌ను సరికొత్త లెవల్‌కు తీసుకువెళతాయి.

లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌

LeEco తన లీ 1ఎస్ ఇకో, లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ల‌ను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. Eros Now, YuppTV, Hungama Musicల భాగస్వామ్యంతో లీఇకో ఈ సేవలను అందిస్తోంది.

ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా..

లీఇకో సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా యూజర్లు Le Vidi పేరుతో వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఈ సేవలను Eros Now సహకారంతో లీ ఇకో అందించనుంది. మరో సర్వీస్ Le Liveలో భాగంగా YuPP TV అందించే 100కు పైగా టీవీ ఛానళ్లను ఫోన్‌లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. హంగామా మ్యూజిక్ భాగస్వామ్యంతో అందిస్తోన్న Le Music సర్వీస్ ద్వారా 35 లక్షల పాటలతో పాటు లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను ఆస్వాదించవచ్చు. మరో సర్వీస్ లీఇకో డ్రైవ్‌‍లో భాగంగా ప్రతి ఒక్క యూజర్ 5TB పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco's Content integrated TVs to set next big trend to shape the Indian TV industry. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot