మొదటి సేల్ అదిరింది!

3 రోజుల్లో 1200 సూపర్ టీవీలను విక్రయించి LeEco సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది. ఆగష్టు 10 నుంచి 12 వరకు , LeMall.com అలానే Flipkartలలో ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహించిన ఆన్‌‍లైన్ ప్రీసేల్‌లో భాగంగా మొట్టమొదటి సారిగా తన 55 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ సూపర్ టీవీలను LeEco అందుబాటులో ఉంచింది.

మొదటి సేల్ అదిరింది!

తన సూపర్3సిరీస్ టీవీలతో ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన లీఇకో తొలి ప్రయత్నంలోనే 55 అంగుళాల అంతకన్నా ఎక్కువ డిస్‌ప్లేను కలిగిన టీవీ క్యాటగిరీల విభాగంలో నెం.1 స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకమైన కంటెంట్ ఇకోసిస్టంతో వస్తోన్న లీఇకో టీవీలు విప్లవాత్మక ఫీచర్లతో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌

LeEco ఆఫర్ చేస్తున్న సూపర్ 3 సిరీస్ టీవీల పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల ఉచిత మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌ను లీఇకో ఆఫర్ చేస్తోంది.

2000 సినిమాలు

ఈ మెంబర్‌షిప్‌ను పొందటం ద్వారా 2000 హైడెఫినిషన్ క్వాలిటీ సినిమాలతో పాటు 100కు పైగా శాటిలైట్ టీవీ ఛానళ్లు, 3.5 మిలియన్ల పాటలు, 50కు పైగా live concertsలను ఆస్వాదించవచ్చు.

ప్రీ సేల్‌లో భాగంగా

ప్రీ సేల్‌లో భాగంగా తమ సూపర్ 3 టీవీ సిరీస్‌ టీవీలకు లభించిన ఆదరణ నూతన ఉత్తేజాన్ని నింపిందని తరువాతి ఫ్లాష్ సేల్‌కు కూడా ఇదే విధమైన స్పందన ఉంటుందని లీఇకో ఇండియా స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ బిజినె్ సీఓఓ అతుల్ జెయిన్ ధీమా వ్యక్తం చేసారు.

 

లీఇకో అందిస్తోన్న టీవీల రేంజ్‌

లీఇకో అందిస్తోన్న టీవీల రేంజ్‌ను పరిశీలించినట్లయితే.. సూపర్3మాక్స్65 (3డీ డిస్‌ప్లే సపోర్ట్), సూపర్3మాక్స్‌ఎక్స్65, సూపర్3మాక్స్‌ఎక్స్55. ఈ మూడు టీవీలు ఆగష్టు 4న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. పూర్తి మెటల్ బాడీతో  వస్తోన్న ఈ టీవీలలో 4కే అల్ట్రా హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. తద్వారా, క్రిస్టల్ క్లియర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

 

LeTV EUI 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన LeTV EUI  5.5 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఈ టీవీలు రన్ అవుతాయి. Levidi, LIVE, LeView, Panosearch వంటి కంటెంట్ వ్యూవింగ్ యాప్స్‌ను టీవీలలో ఇన్‌బుల్ట్‌గా నిక్షిప్తం చేసారు.

ధరలు...

LeEco Super3X55 మోడల్ ధర రూ.59,790. LeEco Super3 X65 మోడల్ ధర రూ.99,790. LeEco Super Max65 మోడల్ ధర రూ.1,49,790. వీటి కొనుగులు పై రూ.9,800 విలువ చేసే రెండు సంవత్సరాల లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Super3 TVs create a new milestone in Indian TV Industry. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot