మార్కెట్లోకి లెనోవో 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్, ధర రూ.6,999
సీఈఎస్ 2015లో వేదికగా ప్రపంచానికి పరిచయమైన లెనోవో 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్ ‘లెనోవో ఏ6000' ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.6,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
‘లెనోవో ఏ6000' మొదటి ఫ్లాష్ సేల్‌కు సంబంధించి రిజిస్ట్రిషేన్‌లను ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ జనవరి 27తో ముగుస్తుంది. జనవరి 28 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.
లెనోవో ఏ6000 కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ మైక్రోసిమ్ స్లాట్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 128 గ్రాములు, మందం 8.2మిల్లీ మీటర్లు.


Click it and Unblock the Notifications








