లెనోవో చేతుల్లోకి మోటరోలా మొబిలిటీ

Posted By:

తమ మోటరోలా మొబిలిటీ హ్యాండ్‌సెట్ విభాగాన్ని చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో కొనుగోలు చేసినట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ $2.91బిలియన్‌లుగా గూగుల్ పేర్కొంది. సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ మోటరోలా మెబిలిటీని 2012లో $12.5బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

లెనోవో చేతుల్లోకి మోటరోలా మొబిలిటీ

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజురోజుకు పెరుగుతున్న పోటీ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లెనోవోకు ఇప్పటికే చైనా మార్కెట్లో మంచి పట్టు ఉంది. మోటరోలా మొబిలిటీ మొబైల్ డివిజన్‌ను సొంతం చేసకున్న నేపధ్యంలో లెనోవో, యూఎస్ ఇంకా ఇతర ప్రధాన మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకనే అవకాశాలు ఉన్నాయి. ఈ డీల్‌లో భాగంగా మోటరోలా మొబిలిటీకి సంబంధించిన పలు పేటెంట్ హక్కులను గూగుల్ తన ఆధీనంలో ఉంచుకునే అవకాశం ఉంది.

లెనోవో చేతికి ఐబీఎమ్ సర్వర్ వ్యాపారం

చైనాకు చెందిన ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో టెక్నాలజీ దిగ్గజం ఐబీఎంకు చెందిన దిగువస్థాయి సర్వర్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 230 కోట్ల డాలర్లు. ఈ మొత్తం చెల్లింపులో భాగంగా 200 కోట్ల డాలర్లు నగదు రూపంలో మిగిలిన మొత్తాన్ని వాటాల రూపంలో కేటాయించనుంది. 2005లో ఐబీఎంకు చెందిన పీసీ వ్యాపారాన్ని సైతం లెనోవో సొంతం చేసుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot