Home
News

సిమ్‌కార్డ్ లేకుండానే ఇంటర్నెట్!

By Hazarath

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న లెనోవా మరొక సంచలనానికి సిద్ధమైంది. తొలిసారిగా సిమ్ లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇక దేశంలో అయితే మీరు ఎక్కడికివెళ్లినా సిమ్ లేకుండా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి రోమింగ్ చార్జీలు పడవు..కనెక్ట్ పేరుతో ఈ ఫీచర్‌ను లెనోవా మార్కెట్లోకి తెస్తోంది.

Read more: లెనోవా నుంచి ప్రపంచంలోనే అతి పలుచని ల్యాప్‌టాప్

సిమ్‌కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు

సిమ్‌కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు

వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్‌కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు

సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది.

లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని

లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని

ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో

ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో

ముందుగా ఈ సరికొత్త ప్లాన్‌ను చైనాలో ప్రవేశపెడుతోంది. అక్కడ విజయవంతమయితే అది మిగతా అన్ని దేశాలకు విస్తరించే ప్లాన్ చేస్తోంది. అతి త్వరలోనే చైనాలో ఈ ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

లెమాంగ్ ఎక్స్ 3 అలాగే ఎమ్‌ఐఐ‌ఎక్స్ 700 టాబ్లెట్లకు

లెమాంగ్ ఎక్స్ 3 అలాగే ఎమ్‌ఐఐ‌ఎక్స్ 700 టాబ్లెట్లకు

చైనాలో లెమాంగ్ ఎక్స్ 3 అలాగే ఎమ్‌ఐఐ‌ఎక్స్ 700 టాబ్లెట్లకు ఈ ఫీచర్ తొలిసారిగా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.

బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా

బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా

ఇక వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది.

కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే

కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే

దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది. 

థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని

థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని

థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్‌కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా

ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా

ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్‌వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది.

ఈ సర్వీసును బార్సిలోనాలో జరిగిన ముుబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో

ఈ సర్వీసును బార్సిలోనాలో జరిగిన ముుబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో

ఈ సర్వీసును బార్సిలోనాలో జరిగిన ముుబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లెనోవా పరిచయం చేసింది. త్వరలోనే 3జీ ,4జీకి టెక్నాలజీకి సంబంధించి క్వాల్‌కామ్ డివైస్‌ల కొరకు లైసెన్స్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

తరచుగా ప్రయాణాలు చేసేవారికి

తరచుగా ప్రయాణాలు చేసేవారికి

తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Lenovo Connect Is A Global Roaming Service That Lets You Connect To The Internet Without A SIM Card
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X