మోటరోలాతో యాపిల్, సామ్‌సంగ్‌లకు షాకిచ్చిన లెనోవో

|

యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను టార్గెట్ చేస్తూ చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ లెనోవో ఓ యూట్యూబ్ వీడియోను లాంచ్ చేసింది. అక్కడితో ఆగకుండా న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ దినపత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్‌ను విడుదల చేసింది.

మోటరోలాతో యాపిల్, సామ్‌సంగ్‌లకు షాకిచ్చిన లెనోవో

Read More : ఆ ఫోన్‌లను సగం ధరకే అమ్మేస్తున్నారు..?

''Skip the Sevens'' పేరుతో సరికొత్త ప్రచారానికి తెరలేపిన లెనోవో.. యాపిల్ (ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్), సామ్‌సంగ్ (గెలాక్సీ 7, గెలాక్సీ నోట్ 7) ఫోన్‌లకు బదులుగా తన విప్లవాత్మక Moto Z స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలని వినియోదారులను కోరుతోంది. ముఖ్యందా మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లోని Moto Mods ఫీచర్ ను లెనోవో హైలెట్ చేస్తూ ఐఫోన్ ప్రియులను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆ వీడియోను మీరు చూడండి..

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

మోటరోలా Moto Z ప్రత్యేకతలు

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్ అలానే స్టెయిన్‌లెస్ స్టీల్ లోహాలతో రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ 5.2 మిల్లీమీటర్ల మందంతో మన్నికకు మారుపేరుగా నిలుస్తుంది.

శక్తివంతమైన డిస్‌ప్లే

శక్తివంతమైన డిస్‌ప్లే

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ 1440 పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌‍ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. డిస్‌ప్లేలో పొందుపరిచిన 535 పీపీఐ హై పిక్సల్ డెన్సిటీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

 

క్వాల్కమ్ క్వాడ్‌కోర్
 

క్వాల్కమ్ క్వాడ్‌కోర్

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 2.2గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్ డ్రాగన్820 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని బలోపేతం చేస్తుంది. 4జీబి ర్యామ్ ఫోన్ మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను రెట్టింపు చేస్తుంది.

 

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే రెండు స్టోరేజ్ వర్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మొదటి వర్షన్ 32జీబి, రెండవ వర్షన్ 64జీబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2 TB వరకు విస్తరించుకునే అవకాశం.

 

కెమెరా

కెమెరా

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎఫ్.8 అపెర్చుర్), ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. (కెమెరా ప్రత్యేకతలు : వైడ్ యాంగిల్ లెన్స్, f/2.2 అపెర్చుర్).

 

నానో కోటింగ్‌తో

నానో కోటింగ్‌తో

వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోన్నఈ ఫోన్ నీటిలో తడిచినప్పటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.

Moto Mods

Moto Mods

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌కు Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా అందిస్తోంది. వీటితో మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌ను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌ను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

 

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్ హై సెక్యూర్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఈ స్కానర్ ద్వారా జస్ట్ సింగిల్ టచ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

బ్యాటరీ

బ్యాటరీ

మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తోన్న ఈ ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 8 గంటల బ్యాకప్‌ను పొందవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

4జీ ఎల్టీఈ, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను మోటో జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో మోటరోలా అందిస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్రంట్ ఫేసింగ్ లౌడ్ స్పీకర్స్ ఆకట్టుకుంటాయి.

మాడ్యులర్ యాక్సెసరీస్‌

మాడ్యులర్ యాక్సెసరీస్‌

Moto Mods పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను Moto Z స్మార్ట్‌ఫోన్‌‌ కోసం మోటరోలా ఆఫర్ చేస్తుంది. వీటితో ఫోన్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

Incipico offGRID

Incipico offGRID

2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆఫరింగ్‌తో వస్తోన్న Incipico offGRID Power Pack.ఈ Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది.

జేబీఎల్ సౌండ్ బూస్టర్

జేబీఎల్ సౌండ్ బూస్టర్

జేబీఎల్ సౌండ్ బూస్టర్ అనే మరో Mod మోటో జెడ్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను బ్యాటరీ పవర్‌హౌజ్‌లాగా మార్చేస్తుంది. InstaShare Projector సహాయంతో ఫోన్‌ను పోర్టబుల్ ప్రొజెక్టర్ లా మార్చేసుకోవచ్చు.

 కెమెరా లెన్స్‌

కెమెరా లెన్స్‌

ఈ ఫోన్‌తో ఆఫర్ చేస్తున్న Hasselblad True Zoom Moto Mod, ఫోన్‌ను అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Lenovo to Apple fans: Moto Z's 'better' than new iPhones. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X