Home
News

బ్యాక్ టు కాలేజ్ పేరుతో ఊహించని డిస్కౌంట్లతో లెనోవా ల్యాప్‌టాప్‌లు

లెనోవా తన వెబ్‌సైట్‌లో బ్యాక్ టు కాలేజ్ అనే మరోక అమ్మకాన్ని హోస్ట్ చేస్తోంది.ఇందులో భాగంగా లెనోవా యొక్క ల్యాప్‌టాప్‌లను రాయితీ ధరలకు మరియు బండిల్ చేయబడిన అద్భుతమైన ఒప్పందాలకు అందిస్తోంది. అమ్మకంలో భాగంగా లెనోవా యొక్క యోగా, ఐడియాప్యాడ్ మరియు లెజియన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు జాబితాలో చేర్చబడ్డాయి. ఆగష్టు 20 వరకు అమ్మకాలు జరపనున్నట్లు కంపెనీ తెలిపింది.

lenovo back to college sale yoga ideapad legion laptops deals offers

అన్ని ల్యాప్‌టాప్‌లు ఒప్పందాలలో భాగంగా 3 సంవత్సరాల వారంటీ, గేమింగ్ గేర్, 1TB ఎక్సటర్నల్ HDD మరియు మరిన్ని డిస్కౌంట్ ధరలకు ఉన్నాయి.అమ్మకాల కాలంలో యూజర్లు రూ.14,979 విలువైన ల్యాప్‌టాప్‌ ఒప్పందాలను కేవలం 3,497 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ తెలిపింది.

లెనోవా యోగా 530:

లెనోవా యోగా 530:

చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవా యోగా 530, యోగా 730, మరియు యోగాC 930 గ్లాస్ ల్యాప్‌టాప్‌లను ఈ అమ్మకంలో జాబితా చేసింది. యోగా 530 చాలా చౌకైనది మరియు వినియోగదారులు దీనిని కేవలం 47,282రూపాయల వద్ద కొనుగోలు చేయవచ్చు.ఈ ల్యాప్‌టాప్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది 2-ఇన్ -1 కన్వర్టిబుల్ డీన్,14-inch ఫుల్-హెచ్‌డి డిస్‌ప్లే,16 జిబి వరకు ర్యామ్ మరియు 512 జిబి ఎస్‌ఎస్‌డితో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ న్విడియా జిఫోర్స్ MX130 గ్రాఫిక్‌లతో ఇంటెల్ కోర్ ఐ 7 ఎనిమిదవ జెన్ ప్రాసెసర్ను కలిగి ఉంది. దీని యొక్క బ్యాటరీ 9 గంటల వరకు ఉంటుంది మరియు ఇది 1.67 కిలోల బరువుతో ఉన్నట్లు తెలుస్తోంది.లెనోవా యోగాలో మరొక రెండు వేరియంట్ లు కూడా అమ్మకాలలో ఉన్నాయి.వీటిలో యోగా 730 ధర 1,01,753రూపాయలు మరియు యోగాC930 గ్లాస్ ధర 1,59,990 రూపాయలు.

లెనోవా ఐడియాప్యాడ్ సిరీస్:

లెనోవా ఐడియాప్యాడ్ సిరీస్:

ఐడియాప్యాడ్ సిరీస్‌లో భాగంగా లెనోవా ఐడియాప్యాడ్ 330, ఐడియాప్యాడ్ 500 సిరీస్ మరియు ఐడియాప్యాడ్ 330 ల ల్యాప్‌టాప్‌లను ఈ అమ్మకాలలో జాబితా చేసింది. ఐడియాప్యాడ్ 330 ధర కేవలం 28,830రూపాయలు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే లెనోవా ఐడియాప్యాడ్ 330 ల్యాప్‌టాప్‌ 15-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ i7 ఎనిమిదవ తరం ప్రాసెసర్, 16 జిబి ర్యామ్, 2TB హెచ్‌డిడి, ఎస్‌ఎస్‌డి + హైబ్రిడ్ ఆప్షన్ ఉన్నాయి. దీని బరువు సుమారు 2.2 కిలోలు.ఈ సిరీస్ లో మరొక రెండు వేరియంట్ ధరలు ఐడియాప్యాడ్ 500 ధర సుమారు 58,574రూపాయలు మరియు ఐడియాప్యాడ్ 330 ధర సుమారు 33,664 రూపాయలు.

లెజియన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు:

లెజియన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు:

ఈ అమ్మకంలో భాగంగా చివరగా లెజియన్ సిరీస్ లోని లెజియన్Y530 ధర 75,568రూపాయలు నుండి మొదలవుతుంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ యొక్క స్పెసిఫికేషన్ లో భాగంగా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్‌ప్లే, ఎనిమిదవ జెన్ ఇంటెల్ కోర్ i7-8750 ప్రాసెసర్, 32 జిబి వరకు ర్యామ్ మరియు 512GB ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ఉన్నాయి. ఇది న్విడియా జిఫోర్స్ GTX 1059 గ్రాఫిక్స్ కార్డును కలిగి ఉంటుంది మరియు దీని యొక్క బరువు 2.3 కిలోల వరకు ఉంటుంది మరియు ఈ ల్యాప్‌టాప్ 52.5Wh బ్యాటరీతో అనుసంధానించబడి ఉంటుంది .

ఆఫర్స్:

ఆఫర్స్:

లెనోవా కంపెనీ లిస్టెలో ఉన్న అన్ని ల్యాప్‌టాప్‌ల మీద మూడు సంవత్సరాల వారంటీ ధర రూ.8,990ను కేవలం రూ.999లకు అందిస్తుంది.రూ. 4,990 విలువ గల 1 టిబి హెచ్‌డిడి కేవలం రూ.1,499లకు అందిస్తుంది. రూ.8,990 విలువ గల గేమింగ్ గేర్ విలువ రూ. 1,999లు మాత్రమే. ఒక సంవత్సరం ప్రీమియం కేర్ కేవలం రూ. 999 (అసలు ధర రూ. 1,990). పైన పేర్కొన్న అన్ని ల్యాప్‌టాప్‌లలో ఈ బండిల్ ఒప్పందాలు వర్తిస్తాయి. లెనోవా బ్యాక్ టు కాలేజ్ అమ్మకంలో అన్ని ఒప్పందాలు మరియు ఆఫర్లను చూడటానికి కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్ళండి.

More from GizBot

Best Mobiles in India

English summary
lenovo back to college sale yoga ideapad legion laptops deals offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X