లెనోవో ప్రచారకర్తగా రణబీర్ కపూర్!

Posted By: Prashanth

లెనోవో ప్రచారకర్తగా రణబీర్ కపూర్!

 

న్యూఢిల్లీ: కంప్యూటర్ల తయారీ సంస్ధ లెనోవో తన బ్రాండ్ ప్రచారకర్తగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను నియమించుకుంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో దేశీయ పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్లో లెనోవో వాటా 15.8 శాతంగా ఉంది. ఈ మార్కెట్ వాటాను ఇంకా పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. యువత మెచ్చే బ్రాండ్‌గా లెనోవో గుర్తింపు పొందాలన్న సంకల్పంతో రణబీర్ కపూర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నట్లు లెనోవో ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) శైలేంద్ర కత్యాల్ తెలిపారు. త్వరలోనే కపూర్‌తో టీవీ ప్రకటనలను విడుదలచేస్తునట్లు ఆయన తెలిపారు. జూన్ 12 నాటికి ఈ ప్రకటనలు ప్రసారమవుతాయని కత్యాల్ స్పష్టం చేశారు.

కపిల్ సిబల్‌ను కలిసిన రతన్ టాటా వారసుడు సైరస్ మిస్ర్తి

స్పెక్ట్రమ్ వేలం విషయంలో టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ నిర్ణయించిన ధరలపై టెలికాం రంగం నుంచి వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో రతన్ టాటా వారసుడు, కాబోయే టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి కేంద్ర టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబల్‌ను సోమవారం కలిశారు. మిస్ర్తితోపాటు టాటా టెలిసర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ నరసింహన్ సైతం ఉన్నారు. టెలికాం రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులపై సిబల్‌తో చర్చించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting