లెనోవో కే4 నోట్ పేలిపోయింది

స్మార్ట్‌ఫోన్‌లు ఎంత మాత్రం సురక్షితం కాదని మరోసారి రుజువైంది. లెనోవో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Lenovo K4 Note పేలుడుకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను @Vignesh3319 అనే ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో పోస్ట్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పూర్తిస్థాయి విచారణ తరువాతనే..

ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు చోటుచేసుకున్న వెంటనే యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు చేపట్టటంతో సంఘటనా స్థలంలో ఏ ఒక్కరూ గాయపడలేదు. లెనోవో ఈ ఘటన పై అధికారికంగా స్పందించాల్సి ఉంది. థర్డ్ పార్టీ యాక్సెసరీని ఉపయోగించటం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన కారణాలు పూర్తిస్థాయి విచారణ తరువాతనే వెలుగులోకి వచ్చే అవకాశముంది.

ఇటువంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి..

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

మీ ఫోన్ సేఫ్టీ కోసం ముఖ్యమైన సూచనలు..

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు. ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి.

మీ ఫోన్ సేఫ్టీ కోసం ముఖ్యమైన సూచనలు..

చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్ ను తొలగించండి. వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచొద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K4 Note explodes in India; shocking photos are out. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot