ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా లెనోవో 'లీప్యాడ్'

Posted By: Staff

ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా లెనోవో 'లీప్యాడ్'

టాబ్లెట్ పిసి రంగంలో సరికొత్త సంచలనా తెరలేపిన ఆపిల్ ఐప్యాడ్‌కు ఇప్పుడు మార్కెట్లో గట్టి పోటీనే ఎదురవుతుంది. ఐప్యాడ్‌కు ధీటుగా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ, మోటరోలా, శాంసంగ్, ఏసస్, ఎల్‌జి, డెల్ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు టాబ్లెట్ పిసిలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఆపిల్ ఐప్యాడ్‌కు మరింత గట్టి పోటీ ఇచ్చేందుకు.. ప్రపంచపు నాల్గవ అతిపెద్ద కంప్యూటర్ల విక్రయదారు అయిన చైనాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో సరికొత్త టాబ్లెట్‌తో ముందుకొచ్చింది. ఐప్యాడ్‌కు ధీటుగా 'లీప్యాడ్‌'ను లెనోవో విడుదల చేసింది.

అంతేకాకుండా.. ఈ ఏడాది మరో రెండు లేదా మూడు కొత్త టాబ్లెట్ పిసిలను కూడా విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే లీప్యాడ్‌ ధరను 533 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 23,809)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఆపిల్ ఐప్యాడ్ ధరల శ్రేణి 800 డాలర్ల (సుమారు రూ. 35736) కంటే ఇది చాలా తక్కువ. లీప్యాడ్ వై-ఫై, 3జీ వెర్షన్లలో లభిస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇది అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యం కానుందని లెనోవో వెల్లడించింది.

లీప్యాడ్ ఫీచర్స్:

* Android 2.2 OS
* At least 1.0 GHz Processor
* Wi-Fi / 3G
* Bluetooth
* 800 x 480 Capacitive Touch Screen
* Camera With LED Flash

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot