Lenovo కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లెజియన్ 2 ప్రో లాంచ్ డేట్, ఫీచర్స్ వివరాలు ఇవిగో...

|

లెనోవా సంస్థ తన యొక్క లెజియన్ సిరీస్‌లోని తదుపరి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. లెనోవా లెజియన్ 2 ప్రో పేరుతో విడుదలయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే వరుస లీక్‌లు మరియు పుకార్లు వచ్చాయి. 2021 ఏప్రిల్ 8 న ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ యొక్క అధికారిక వీబో హ్యాండిల్‌లో హ్యాండ్‌సెట్ గురించి సమాచారాన్ని విడుదల చేసింది. ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ హ్యాండ్‌సెట్ యొక్క ప్రచార పోస్టర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

లెనోవా లెజియన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వీబో పోస్ట్ ప్రకారం లెనోవా లెజియన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.92-అంగుళాల భారీ డిస్ప్లేతో లభిస్తున్నట్లు ధృవీకరించబడింది. ఇది గత సంవత్సరం విడుదలైన లెజియన్ ప్రో కంటే చాలా పెద్దది. లెనోవా సంస్థ డిస్ప్లే పరిమాణాన్ని పెంచినప్పటికీ రిఫ్రెష్ రేటును అదే 144Hz వద్ద అందిస్తున్నది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శామ్సంగ్ అమోలేడ్ ఇ 4 డిస్ప్లేను అమర్చినట్లు లెనోవా చైనా మొబైల్ బిజినెస్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ చెన్ జిన్ ధృవీకరించారు. ఇది వేగవంతమైన రిఫ్రెష్ రేట్ మరియు తక్కువ జాప్యాన్ని అందించగల సామర్థ్యం గల స్క్రీన్‌తో హ్యాండ్‌సెట్ వస్తుందని జిన్ సూచిస్తున్నారు.

లిజియన్ 2

బెంచ్‌మార్క్‌లో కొంత ముఖ్యమైన సమాచారాన్ని కూడా వెల్లడించారు. వివరాలలోకి వస్తే లిజియన్ 2 లిస్టింగ్ ప్రకారం ప్రో వేరియంట్ యొక్క డిస్ప్లే ఫుల్ HD + రిజల్యూషన్‌తో 1080 x 2460 పిక్సెల్, 20.5: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ మాస్టర్ లు బెంచ్మార్క్లో మోడల్ నంబర్ L70081 తో జాబితా చేయబడింది మరియు మొత్తం 962,155 స్కోరును సాధించగలిగింది. ఇందులో సిపియు పరీక్షలో 344,384 పాయింట్లు, జిపియు పరీక్షలో 353,510 పాయింట్లు, మెమరీ పరీక్షలో 121,136 పాయింట్లు చివరిగా స్టోరేజ్ పరీక్షలో 143,125 పాయింట్లను సాధించగలిగింది.

బెంచ్మార్క్ జాబితా
 

బెంచ్మార్క్ లో జాబితా చేసిన సమాచారం ప్రకారం ఇది 16GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ వేరియంట్‌తో రాబోతున్నట్లు నిర్ధారించింది. వీటితో పాటుగా 12GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ల ఉనికిని కూడా ఈ లిస్టింగ్ వెల్లడించింది. చైనా మరియు ఇండియా యొక్క మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ ఏ ధర వద్ద ప్లాన్ చేస్తోందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Lenovo Legion 2 Pro Launch Date Confirmed: Price, specifications, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X