16GB RAM తో లెనోవో కొత్త ఫోన్ ,ఈ నెల 22 న లాంచ్.

By Maheswara
|

గేమింగ్ ఫోన్ లలో కొత్త సంచలనం సృష్టించాలని ఉద్దేశం తో Lenovo, లెజియన్ ఫోన్ ను విడుదల చేస్తోంది. జూలై 22 న లెజియన్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు లెనోవా ప్రకటించింది. ఈ చైనా బ్రాండ్ తన మొదటి గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను పాపులర్ లెజియన్ బ్రాండింగ్ కింద టీజ్ చేస్తోంది.

Lenovo లెజియన్ ఫోన్

Lenovo లెజియన్ ఫోన్

కానీ Lenovo తాజా ప్రకటన లో  Lenovo లెజియన్ ఫోన్ హై-ఎండ్ గేమింగ్‌ను అందించే సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది తెలుస్తోంది.యాదృచ్చికంగా, ఆసుస్ కూడా అదే రోజు( జులై 22) మరియు అదే చిప్‌సెట్‌తో ROG ఫోన్ 3 ను భారతదేశంలో విడుదల చేస్తోంది.

స్నాప్‌డ్రాగన్ 865+ చిప్‌సెట్

స్నాప్‌డ్రాగన్ 865+ చిప్‌సెట్

ఈ ఫోన్ లాంచ్  తేదీని Lenovo , చైనా లో పోపుల సోషల్ మీడియా అయిన వీబో లో ఒక పోస్ట్‌ రూపంలో వెల్లడించింది. అక్కడ లాంచ్ కాబోయే లెజియన్ ఫోన్ గురించి వివరాలతో కూడిన  స్నాప్‌డ్రాగన్ 865+ చిప్‌సెట్ యొక్క పోస్టర్‌ను పంచుకుంది. ఈ కార్యక్రమం బీజింగ్ సమయం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది, మన భారతీయ కాలమానం ప్రకారం  ఇది సాయంత్రం 5 గంటలకు IST గా ఉంటుంది. అదే రోజు, రాత్రి 8.15 గంటలకు, ఆసుస్ ROG ఫోన్ 3 లాంచ్ కూడా ఉండటం విశేషం.

Lenovo  సంస్థ ఉనికి
 

Lenovo సంస్థ ఉనికి

ఈ నెలాఖరులో రెండు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య మంచి పోటీ ని చూడవచ్చు. చైనా వెలుపల లెజియన్ ఫోన్ లభ్యత గురించి లెనోవా ఏమీ చెప్పలేదు.స్మార్ట్ఫోన్ పరిశ్రమలో Lenovo  సంస్థ ఉనికిలో ఉన్న అనేక సంవత్సరాల తరువాత ఇది లెనోవాకు ఒక ముఖ్యమైన లాంచ్ ఈవెంట్ కానుంది. భారతదేశం మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోనే కాకుండా చైనాలో కూడా దాని వివిధ స్మార్ట్‌ఫోన్‌లు చాలా త్వరగా క్షీణించాయి. కానీ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా, లెనోవా యొక్క పిసి వ్యాపారం చైనా, భారతదేశం మరియు ఇతర మార్కెట్లలో అభివృద్ధి చెందుతోంది. వాస్తవానికి లెజియన్ హై-ఎండ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కు మంచి డిమాండు ఉంది . ఆసుస్ ROG ఫోన్ మరియు నుబియా రెడ్ మ్యాజిక్ వంటి వాటితో పోటీ గా  తన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి నెట్టడానికి లెనోవో కంపెనీ ఇప్పుడు లెజియన్ బ్రాండింగ్‌ ను తీసుకువస్తోంది.

144Hz డిస్ప్లే

144Hz డిస్ప్లే

ఇక లెనియో లెజియన్ ఫోన్‌లోని హై-ఎండ్ ఫీచర్లు చూస్తే, స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్ ఉంది,  ఇది ఉత్తమమైన 5 జి మోడెమ్ మరియు ఇతర కనెక్టివిటీ లక్షణాలతో ఉంటుంది, ఇది 2020-ప్రమాణాలతో గేమింగ్ ఫోన్‌కు సరిపోతుంది. లెనోవా లెజియన్ ఫోన్ లో 144Hz డిస్ప్లే  కూడా ఉంది.దీని ద్వారా ఒక రకమైన  FHD + రిజల్యూషన్‌లో అధిక రిఫ్రెష్ రేటును ఆశించవచ్చు.

లీక్ అయిన వివరాలు

లీక్ అయిన వివరాలు

ఇప్పటివరకు లీక్ అయిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే, స్మార్ట్‌ఫోన్ నిలువుగా హ్యాండ్‌హోల్డింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుందని సూచించాయి. లెజియన్ ఫోన్‌ లో  స్మార్ట్‌ఫోన్ వైపు పాప్-అప్ కెమెరాతో ఉంటుంది. AnTuTu బెంచ్ మార్కింగ్  వెబ్‌సైట్ లో పేర్కొన్న వివరాలు ప్రకారం  ఇది 16GB LPDDR5 RAM మరియు 512GB UFS 3.1 మెమరీ తో  రావచ్చు. నిలువుగా పనిచేసే సామర్థ్యాన్ని సులభతరం చేయడానికి 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఉన్న డెడ్ సెంటర్‌లో ఉంటుందని ఒక నివేదిక లో తెలిపారు.

Best Mobiles in India

Read more about:
English summary
Lenovo Legion Gaming Phone With 16GB of RAM Confirmed to Launch on July 22 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X