లెనోవో పండుగ ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌ల పై 6 సంవత్సరాల వారంటీ!

భారత్‌లో ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ చైనా కంపెనీ లెనోవో తన ఉత్పత్తుల పై ఆసక్తికర ఆఫర్లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే ప్రీమియమ్ లెనెవో ల్యాప్‌టాప్స్ పై రెండు సంత్సరాల యాక్సిడెంటల్ డామెజ్ ప్రొటెక్షన్‌తో పాటు రెండు సంవత్సరాల అదనపు వారంటీని లెనోవో ఆఫర్ చేస్తోంది.

Read More : మీ ఆధార్ కార్డులో తుప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోండిలా..?

లెనోవో పండుగ ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌ల పై  6 సంవత్సరాల వారంటీ!

తమ యూజర్లకు ఎటువంటి అవాంతరం లేని మెరుగైన కంప్యూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను వినియోగదారులకు చేరువచేసే లక్ష్యంతో తాము ఉత్పత్తులను అందిస్తున్నట్లు లెనోవో ఇండియా హెడ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కన్స్యూమర్, ఆన్‌లైన్, ఈ-కామర్స్) రాజేష్ తడాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫెస్టివ్ సీజన్‌లో తమ కంప్యూటింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయటం ద్వారా వాటి పై మూడు సంవత్సరాల వరకు అదనపు వారంటీని పొందటంతో పాటు పాటు హార్డ్‌డిస్క్స్, పవర్ బ్యాంక్స్, స్పీకర్స్, హెడ్‌సెట్స్ వంటి ఆసక్తికర బహుమతులను అదనంగా పొందవచ్చని ఆయన తెలిపారు.

Read More : ఐడియా కొత్త ఆఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో 4G VOLTE ఫోన్‌

జియో 4జీ నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నెట్‌వర్క్‌కు అనుగుణంగా కొత్త ఫోన్‌లను లాంచ్ చేసే పనిలో ప్రముఖ బ్రాండ్‌లు నిమగ్నమయ్యాయి. తాజగా లెనోవో Z2 Plus పేరుతో సరికొత్త 4G VOLTE ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియో సిమ్ సపోర్ట్‌తో మార్కెట్లో లభ్యమవుతున్న 8 లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
బెస్ట్ ధర రూ.17,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.

jio-welcome ఆఫ‌ర్‌ను సపోర్ట్ చేస్తున్న ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ (3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్)తో ఉంటుంది. ధర రూ.17,999. రెండు వేరియంట్ వచ్చేసరికి (4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్)తో ఉంటుంది. ధర రూ.19,999. సెప్టంబర్ 25 నుంచి ఈ ఫోన్‌లను Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

 

Lenovo K5 Note

లెనోవో వైబ్ కే5 నోట్
బెస్ట్ ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌, 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

 

Lenovo ZUK Z1

లెనోవో జుక్ జెడ్1
బెస్ట్ ధర రూ.13,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe Shot

లెనోవో వైబ్ షాట్
బెస్ట్ ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5 అంగుళాల FHD ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిమ్ మార్స్ మిల్లో), 1.7గిగాహెర్డ్జ్ 64 బిట్ ఆక్టా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇన్‌ఫ్రా- రెడ్- ఆటో -ఫోకస్, ట్రైకలర్ ఫ్లాష్ విత్ సిక్స్ - పీస్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, బ్యాక్‌సైడ్ ఇల్యూమినేటెడ్ సెన్సార్), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బీటీ 4.0, డ్యుయల్ సిమ్), ఫోన్ మందం 7.3 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

 

Lenovo K4 Note

లెనోవో కే4 నోట్
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe K5

లెనోవో వైబ్ కే5
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబి ఎక్స్‌టర్నల్ స్టోరేజ్. డ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 2750 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe K5 Plus

లెనోవో వైబ్ కే5 ప్లస్
బెస్ట్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. డాల్బీ అటామస్ ఫీచర్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 2,750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

 

Lenovo Vibe P1 Turbo

లెనోవో వైబ్ పీ1 టర్బో
బెస్ట్ ధర రూ.17,040
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్సెసిఫికేషన్స్

5.5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo offers exciting deals this festive season. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot