Lenovo కొత్త టాబ్లెట్ ధర విడుదలైంది ! ఫీచర్లు మరియు లాంచ్ వివరాలు చూడండి.

By Maheswara
|

Lenovo Tab P11 Plus టాబ్లెట్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. లెనోవో బ్రాండ్ యొక్క ఇ-కామర్స్ భాగస్వామి అమెజాన్ ఇప్పటికే దేశంలో ఈ పరికరం యొక్క లాంచ్ టీజర్ ను విడుదల చేసింది. అదనంగా, Lenovo భారతదేశంలో Tab P11 Plus ధరను కూడా వెల్లడించింది. ఈ పరికరం దేశంలో Lenovo Tab P11కి సక్సెసర్‌గా రానుంది.

Lenovo Tab P11 Plus

Lenovo Tab P11 Plus టాబ్లెట్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. లెనోవో బ్రాండ్ యొక్క ఇ-కామర్స్ భాగస్వామి అమెజాన్ ఇప్పటికే దేశంలో ఈ పరికరం యొక్క లాంచ్ టీజర్ ను విడుదల చేసింది. అదనంగా, Lenovo భారతదేశంలో Tab P11 Plus ధరను కూడా వెల్లడించింది. ఈ పరికరం దేశంలో Lenovo Tab P11కి సక్సెసర్‌గా రానుంది.

Lenovo Tab P11

Lenovo Tab P11

Lenovo Tab P11 , Plus octa-core MediaTek Helio G90T ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ 4GB మరియు 6GBతో సహా రెండు RAM వేరియంట్‌లలో వస్తుంది, అయితే స్టోరేజ్ ఎంపికలలో 64GB మరియు 128GB తో ఉన్నాయి. లీనమయ్యే మీడియా అనుభవం కోసం డాల్బీ అట్మాస్ మద్దతుతో క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ విషయాలను గమనిస్తే 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, గ్లోనాస్‌తో కూడిన GPS మరియు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

కెమెరా

కెమెరా

కెమెరా విభాగంలో, Lenovo Tab P11 Plus 13MP ప్రైమరీ షూటర్‌ని ఆటో ఫోకస్ తో మరియు LED ఫ్లాష్ యూనిట్‌తో వస్తుంది. వీడియో కాలింగ్ ప్రయోజనాల కోసం, ఇది 8MP సెల్ఫీ  స్నాపర్‌తో అమర్చబడింది.ఈ టాబ్లెట్ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 7,000 mAh బ్యాటరీతో వస్తుంది.ఈ టాబ్లెట్ పరికరం ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 12 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.

Lenovo Tab P11 Plus అదనపు Lenovo కీబోర్డ్ ప్యాక్ మరియు Lenovo Precision Pen 2 యాక్సెసరీలను కూడా సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు ఈ ఉపకరణాలను విడిగా కొనుగోలు చేయవలసి ఉంటుంది.

భారతదేశంలో Lenovo Tab P11 Plus ధర, లభ్యత

భారతదేశంలో Lenovo Tab P11 Plus ధర, లభ్యత

Lenovo Tab P11 Plus యొక్క వేరియంట్ 6GB RAM మరియు 128GB నిల్వతో రూ. 25,999. గా ఉంది. ఈ టాబ్లెట్ మూడు కలర్ వేరియంట్‌లలో అందించబడుతుంది - ప్లాటినం గ్రే, వైట్ మరియు గ్రీన్. 4GB + 64GB మరియు 4GB + 128GB మెమొరీలు కలిగిన మోడల్‌ల ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. బ్రాండ్ వెబ్‌సైట్‌లో మరియు అమెజాన్ ఇండియాలో త్వరలో కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది.

మోటోరోలా నుంచి కూడా

మోటోరోలా నుంచి కూడా

Lenovo తో పాటు మోటోరోలా నుంచి కూడా త్వరలో కొత్త టాబ్లెట్ లు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.మోటరోలా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లతో పాటుగా టాబ్లెట్ లను కూడా విడుదల చేస్తూ వినియోగదారులను తనవైపుకు ఆకట్టుకున్నది. ఇటీవల ఈ సంస్థ ఇండియాలో బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ ధరలో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే మరికొన్ని రోజులలో తన యొక్క టాబ్లెట్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మోటరోలా సంస్థ మోటో ట్యాబ్ G62 మరియు మోటో ట్యాబ్ G62 లైట్ పేరుతో విడుదల చేయనున్న రెండు టాబ్లెట్ ల యొక్క ఫోటోలను మరియు వాటి యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ చేసింది.

మోటరోలా కొత్త టాబ్లెట్లకు

మోటరోలా కొత్త టాబ్లెట్లకు

మోటరోలా సంస్థ యొక్క కొత్త టాబ్లెట్లకు సంబందించిన ఆన్‌లైన్‌ లీక్ వివరాల ప్రకారం మోటో ట్యాబ్ G62 కేవలం Wi-Fi మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే మరొకటి 4G కనెక్టివిటీ ఎంపికతో వచ్చే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్‌లు గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించిన వాటి వివరాలను టిప్‌స్టర్ షేర్ చేసింది. ఆన్‌లైన్‌లో జాబితా చేయబడిన స్పెసిఫికేషన్ల ఆధారంగా చూసుకుంటే కనుక కొత్త టాబ్లెట్‌లు ఈ సంవత్సరం జనవరిలో భారతదేశంలో లాంచ్ అయిన మోటో ట్యాబ్ G70 LTE యొక్క అప్ గ్రేడ్ గా ఉంటాయని ఊహించబడింది. 

Best Mobiles in India

Read more about:
English summary
Lenovo Tab P11 Plus Is Expected To Launch In India Soon. Price Details Officially Confirmed.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X