నటి గుల్‌పనాగ్‌ చేతుల మీదగా మార్కెట్‌లోకి లెనోవో ఇండియా నోట్‌బుక్‌

Posted By: Staff

నటి గుల్‌పనాగ్‌ చేతుల మీదగా మార్కెట్‌లోకి లెనోవో ఇండియా నోట్‌బుక్‌

పీసీల తయారీదారు లెనోవో ఇండియా కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది. ఎంటర్‌ప్రైజ్‌ వినియోగదార్లను దృష్టిలో ఉంచుకుని రూ.90,000 ప్రారంభ ధరతో థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 పేరుతో ప్రీమియం నోట్‌బుక్‌లను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేసింది. 17 మి.మీ. మందం ఉండే ఈ థింక్‌ప్యాడ్‌ ప్రపంచంలోని అతి తక్కువ మందం గల నోట్‌బుక్‌ అని కంపెనీ చెబుతోంది. స్క్రాచ్‌ ప్రూఫ్‌ గల ఈ నోట్‌బుక్‌ బ్యాటరీ సామర్థ్యం 10 గంటలని.. కేవలం 30 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీని రీఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది. సోమవారం ముంబయిలో కొత్త నోట్‌బుక్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ ఎండీ అమర్‌ బాబు, బాలీవుడ్‌ నటి గుల్‌పనాగ్‌లను చిత్రంలో చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot