'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌'తో.. టీవీలు

Posted By: Super

'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌'తో.. టీవీలు

 

రేపటి నుండి లాస్ వేగాస్‌లో కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES 2012) ప్రారంభం కానుంది. ఈ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎలక్టానిక్స్ రంగంలో త్వరలో విడుదల కానున్న కొత్త కొత్త ఉత్పత్తలను ప్రదర్శించనున్నారు. ఎలక్ట్రానిక్స్ గెయింట్ 'లెనోవా' కొత్తగా టెలివిజన్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ' ఆపరేటింగ్ సిస్టమ్‌తో లెనోవా టెలివిజన్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

లెనోవా అనగానే సాధారణంగా అందరికి గుర్తుకు వచ్చేది ల్యాప్ టాప్, ధింక్ ప్యాడ్స్. ఐతే దీనిని అధిగమించేందుకు గాను లెనోవా టెలివిజన్ మార్కెట్లోకి రానుంది. టెలివిజన్ ప్రపంచంలో మొట్ట మొదటి సారి ఆండ్రాయిడ్ 4.0, ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో టెలివిజన్‌ని రూపొందించిన ఘనతని లెనోవా  సొంతం చేసుకోనుంది. లెనోవా ఈ టెలివిజన్‌కు పెట్టిన పేరు 'లెనోవా కె91 స్మార్ట్'.

 

'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్‌'తో.. టీవీలు

ఐతే లెనోవా ప్రవేశపెట్టనున్న ఈ టెలివిజన్‌ని మొదటగా చైనాలో ప్రవేశపెట్టి ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'లెనోవా కె91' టెలివిజన్ 55 ఇంచ్ టివి. 3డి ఎల్‌ఈడి టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ 'క్వాలికామ్ డ్యూయల్ కోర్ 8060 స్నాప్ డ్రాగెన్' ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేశారు. వీటితో పాటు 1 GB RAM, 2 GB SD card, 8 GB మెమరీ స్టోరేజిని కలిగి ఉండనుంది.

 

యూజర్ ఇచ్చే వాయిస్ కమాండ్స్‌ని బదులు ఇచ్చేందుకు గాను ఇందులో వాయిల్ కంట్రోల్ ఫీచర్‌ని నిక్షిప్తం చేశారు. సెక్యూరిటీ కంట్రోల్స్ తోపాటు, వీడియోని ఈజీగా గుర్తించేందుకు గాను 5 మెగా ఫిక్సల్ వెబ్ కెమెరాని నిక్షిప్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot