వావ్, రూ.4,000కే స్మార్ట్ కళ్లద్దాలా.. లెన్స్‌కార్ట్ ఫానిక్ గ్లాసెస్ ఫీచర్స్ చూస్తే వెంటనే కొనేస్తారు!
Lenskart Phonic Smart Glasses: ఫ్యాషన్ ప్రపంచంలో టెక్నాలజీ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్‌కార్ట్, ఫానిక్ పేరుతో సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. చూడటానికి సాధారణ కళ్లద్దాల్లాగే ఉన్నా, వీటిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా బ్లూటూత్ ఆడియోతో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో ఇకపై ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు, పాటలు వినొచ్చు, అంతేకాదు గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి వాయిస్ అసిస్టెంట్‌ను కూడా వాడుకోవచ్చు.
* ధర, లభ్యత వివరాలు..
లెన్స్‌కార్ట్ ఫానిక్ స్మార్ట్ గ్లాసెస్ (Phonic smart glasses) ధర నిజంగానే అందరికీ అందుబాటులో ఉండేలా ఉంది. వీటి ధర కేవలం రూ.4,000 మాత్రమే. అయితే వెబ్‌సైట్‌లో వీటి MRP ధర రూ.7,000గా ఉంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ ఆన్‌లైన్‌లో లెన్స్‌కార్ట్ వెబ్‌సైట్‌లోనూ, అలాగే భారతదేశంలోని ఎంపిక చేసిన లెన్స్‌కార్ట్ స్టోర్లలోనూ అందుబాటులో ఉన్నాయి.

* స్టైలిష్ ఫ్రేమ్స్, కలర్ ఆప్షన్స్
ఈ ఫానిక్ స్మార్ట్ గ్లాసెస్ రెండు స్టైలిష్ ఫ్రేమ్స్‌లో వస్తున్నాయి. అవి నావిగేటర్, హస్ట్‌లర్. ఇంకా కలర్స్ విషయానికొస్తే మ్యాట్ బ్లాక్, షైనీ బ్లూ రంగుల్లో లభిస్తాయి. మీకు నచ్చిన స్టైల్, కలర్ కాంబినేషన్స్‌లో వీటిని ఎంచుకోవచ్చు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. ఇంకా ఏ సందర్భానికైనా ఈ స్మార్ట్ గ్లాసెస్ చాలా బాగా సూట్ అవుతాయి.
* లెన్స్‌లు, ఫీచర్స్
లెన్స్‌కార్ట్ చాలా లెన్స్ ఆప్షన్స్ ఇస్తోంది. యాంటీ-గ్లేర్ ప్రీమియం లెన్స్‌లు, బ్లూ-స్క్రీన్ లెన్స్‌లు (డిజిటల్ స్క్రీన్ల కోసం), ఓన్‌డేస్ షాటర్‌ప్రూఫ్ లెన్స్‌లు (ఎక్కువ మన్నికకు), ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లు (దగ్గరి లేదా దూరపు చూపుకు), బైఫోకల్ లేదా ప్రోగ్రెసివ్ లెన్స్‌లు.. ఇలా అవసరానికి తగ్గట్టు లెన్స్‌లను ఎంచుకోవచ్చు. లెన్స్ రకాన్ని బట్టి ధరలో కొద్దిగా మార్పులు ఉండొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే, లెన్స్‌కార్ట్ ఫానిక్ స్మార్ట్ గ్లాసెస్‌లో టెంపుల్స్ దగ్గర బిల్ట్-ఇన్ స్పీకర్లు ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు, వీటి ద్వారానే సౌండ్ వస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడటం, పాటలు వినడం, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్లతో మాట్లాడటం.. అన్నీ ఈజీగా చేసుకోవచ్చు.
* సింపుల్ కంట్రోల్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్
గ్లాసెస్ టెంపుల్ కింద ఒక స్మార్ట్ బటన్ ఉంటుంది. ఒక్క ప్రెస్‌తోనే ఫంక్షన్స్‌ను కంట్రోల్ చేయొచ్చు. మ్యూజిక్ ప్లే చేయడం, పాజ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం వంటివి ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 7 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. బాక్స్‌లోనే ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తున్నారు.
* ఎవరి కోసం ఈ స్మార్ట్ గ్లాసెస్
లెన్స్‌కార్ట్ ఫానిక్ స్మార్ట్ గ్లాసెస్ చాలా తేలికగా ఉంటాయి. రోజంతా చాలా సౌకర్యవంతంగా, కంఫర్ట్‌గా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ప్రొఫెషనల్స్, డ్రైవర్లు, రోజూ ప్రయాణాలు చేసేవాళ్లకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు అవాంతరాలు తగ్గించడానికి కూడా ఈ గ్లాసెస్ హెల్ప్ చేస్తాయని లెన్స్‌కార్ట్ చెబుతోంది.
ఇంకా ఈ గ్లాసెస్ -8 D నుంచి +6 D వరకు కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్‌లకు సపోర్ట్ చేస్తాయి. మొత్తానికి లెన్స్‌కార్ట్ ఫానిక్ స్మార్ట్ గ్లాసెస్ ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి సరసమైన ధరలో అందిస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ లేకుండానే కనెక్ట్ అయి ఉండాలనుకునే వాళ్లకి ఇవి బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications