సాప్ట్‌వేర్ హాబ్ అయిన బెంగళూరు ఇన్పోసిస్ క్యాంపస్‌లో చిరుత

Posted By: Staff

సాప్ట్‌వేర్ హాబ్ అయిన బెంగళూరు ఇన్పోసిస్ క్యాంపస్‌లో చిరుత

మైసూరు: బెంగళూరు ఇన్పోసిస్ క్యాంపస్ లోకి ప్రవేశించిన చిరుత పులి దాదాపు ఏడు గంటల పాటు అక్కడున్నటువంటి జనాభాకి ముచ్చెమటలు పట్టించింది. చివరకు అటవీ సిబ్బంది దానికి మత్తు మందు ఇచ్చి అడవుల్లోకి వదిలి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగర శివార్లలోని హెబ్బాళ పారిశ్రామికవాడలో ఉన్నటువంటి ఇన్పోసిస్ క్యాంపస్ లోకి మంగళవారం రాత్రి చిరుత ప్రవేశించింది. దాంతో రాత్రి పూట పనిచేస్తున్నటువంటి సిబ్బంది అర్దరాత్రి 2.30 సమయంలో దానిని గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేయడం జరిగింది.


దాదాపు 70 మంది సిబ్బంది గాలించి షెడ్డులో దాక్కోని ఉన్నటువంటి చిరుత పులిని పట్టుకోవడం జరిగింది. ఆ ప్రయత్నంలో ఇన్పోసిస్ క్యాంపస్ లోని ఫోటో గ్రాఫర్ ప్రశాంత్ చిరుతని తన కెమెరాలో బంధించడానికి ప్రయత్నం చేయగా ఆయనపై దాడి చేసింది. దాంతో అతని చేతివేళ్శకు గాయాలు అయ్యాయి. ఈరోజు ఉదయం జంతు ప్రదర్శనశాల సిబ్బంది చిరుతకు మత్తు మందు ఇచ్చి దగ్గరలో ఉన్న అడవిలో వదిలి పెట్టడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot