ఈ పెన్ స్పెల్లింగ్‌లను చెక్ చేస్తుంది

ఇప్పుడు అన్ని టెక్స్ట్ ప్రాసెసింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లలో ఆటో కరెక్షన్ సిస్టం అందుబాటులోకి వచ్చేసింది. స్పెల్లింగ్ దోషాలను గుర్తించే సరికొత్త పెన్‌ను లెర్న్‌స్టిఫ్ట్ అనే కంపెనీ వృద్థి చేసింది.

వివిధ డిజిటల్ అప్లికేషన్‌ల సహకారంతో స్పందించే ఈ స్మార్ట్ పెన్‌లో ఓ ప్రాసెసర్, మోషన్ సెన్సార్, వై-ఫై, వైబ్రేషన్ మాడ్యుల్ అలానే మెమరీ కార్డ్‌ను ఏర్పాటు చేసారు. లెన్సెక్స్ ఆధారంగా స్పందించే ఓ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేసారు. ఈ పెన్‌లోని కంప్యూటింగ్ ఇంజన్ మీరు రాసే స్పెల్లింగ్‌లను పరిశీలిస్తూ ఏమైనా దోషాలు తలెత్తినట్లయితే వాటిని గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుంది.

లెర్న్‌స్టిఫ్ట్ స్మార్ట్ పెన్‌లో ఉపయోగించిన పరికరాలు
మోషన్ సెన్సార్,
హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్
ప్రెజర్ సెన్సార్,
నెట్ వర్క్ మాడ్యుల్,
స్విచ్,
బ్యాటరీ,
రీఫిల్.


Click it and Unblock the Notifications








