LG నుంచి స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్, ధర కాస్త ఎక్కువే
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ కంపెనీ సీలింగ్ ఫ్యాన్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. భారత్ మార్కెట్లో స్మార్ట్‌ఫీచర్లతో ప్రీమియం సీలింగ్ ఫ్యాన్‌లను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లను చెన్నైలో లాంచ్ చేసింది. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కాగా ఈ సీలింగ్ ఫ్యాన్ ధరను రూ. 13,990గా ఎల్‌జీ కంపెనీ నిర్ణయించింది. దేశంలో గృహోపకరణాలు, ఎయిర్ సొల్యూషన్స్ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారత మార్కెట్లో సీలింగ్ ఫ్యాన్ విభాగంలోకి ఎల్‌జీ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మొత్తం 5 రకాల సీలింగ్ ఫ్యాన్‌లను
అత్యాధునిక ఫీచర్లను జోడించి ప్రీమియం ధరల్లో మొత్తం 5 రకాల సీలింగ్ ఫ్యాన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. వై-ఫై ఆధారితంగా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో లాంచ్ చేశామని ఎల్‌జీ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ టక్నాలజీకి అనుసంధించామనీ, ఐఓటి ప్లాట్‌ఫామ్ ద్వారా తీసుకొచ్చిన ఎల్‌జి స్మార్ట్‌థింక్యూ మొబైల్‌తో పాటు ఇతర మొబైల్ ఫోన్‌ల ద్వారా రిమోట్‌గా నియంత్రించుకోవచ్చని పేర్కొంది.

స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ ఫీచర్లు
వై ఫై ఆధారితం
అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ అనుసంధానం
వాతావరణానికి అనుకూలంగా స్పీడ్ కంట్రోల్ ,
తక్కువ శబ్దం, రిమూవబుల్ పార్ట్స్, రిమోట్

జూలై 1నుంచి అమ్మకానికి
ఈ ఫ్యాన్లను కంపెనీ ఇండియాలోనే తయారుచేస్తోంది. నోయిడాలోని LG ఫ్లాంట్ లో వీటిని తయారు చేస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది. జూలై 1నుంచి ఈ ఫ్యాన్లు చెన్నై మార్కెట్లోకి అమ్మకానికి రానున్నాయి. ఇందులో అత్యాధునిక టెక్నాలజీని పొందుపరిచారు. దోమలను దూరంగా తరిమేసే టెక్నాలజీని కూడా ఇందులో ప్రవేశపెట్టినట్లుగా ఎల్ జీ కంపెనీ తెలిపింది.

Puricare Mini Air purifier
ఇదిలా ఉంటే గతేడాది LG కంపెనీ ఇండియాలో premium fan segment మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్పత్తులతో పాటుగా ఇతర ఉత్పత్తులను కూడా కంపెనీ ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. Puricare Mini Air purifier ను ఆగస్టులో కంపెనీ లాంచ్ చేయనుంది. దీని ధరను రూ. 15,990గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం 7 రకాల మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది. వీటితో పాటుగా RO water purifiersను కూడా ఇండియాలో రూ.16,990 ధరకు ప్రవేశపెట్టనుంది. ఈ purifiers నీటిని పొదుపుగా వాడేలా తయారుచేశారు. 50 శాతం వాటర్ రికవరీ చేయడం ద్వారా సేవ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








