LG సంస్థ నుండి ఫోల్డబుల్ టీవీ!!నిజమా??

|

శామ్సంగ్ మరియు Huawei వంటి సంస్థలు ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను ప్రకటించారు. ఇందులో శామ్సంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. దక్షిణ కొరియన్ టెక్ దిగ్గజం LG కూడా ఇప్పుడు తన ఫోల్డబుల్ డివైస్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కానీ అందరి లాగా ఫోల్డబుల్ ఫోన్ ను కాకుండా మడవగల టీవీను అందించనున్నది.

 

స్మార్ట్ టీవీ

LG సంస్థ నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని రకాల టీవీలు మరియు స్మార్ట్ టీవీలు ఒక ఎత్తు అయితే ఫోల్డబుల్ టీవీ ఒక ఎత్తు అనేలా దీనిని రూపొందించాలని సంస్థ భావిస్తోంది. LG ఇప్పటికే తన కొత్త రకం టీవీ గురించి కొన్ని డెమో చిత్రాలను ప్రదర్శించింది.

 

ఆపిల్ వాచ్‌కు పోటీగా షియోమి స్మార్ట్ వాచ్... ధర ఎంతో తెలుసా??ఆపిల్ వాచ్‌కు పోటీగా షియోమి స్మార్ట్ వాచ్... ధర ఎంతో తెలుసా??

లెట్స్‌గో డిజిటల్

లెట్స్‌గో డిజిటల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ 'హేగ్ ఇంటర్నేషనల్ డిజైన్ సిస్టమ్‌తో మార్చి 2019 లో టెలివిజన్ రిసీవర్ విత్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే 'కోసం పేటెంట్ దాఖలు చేసింది. ఈ డిజైన్ పేటెంట్‌లో ఉత్పత్తికి సంబందించిన 9 స్కెచ్‌లు మరియు వాటి గురించి సంక్షిప్త వివరణ ఉన్నాయి.

 

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 ప్రారంభ విశేషాలు....ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 ప్రారంభ విశేషాలు....

టెలివిజన్
 

ఈ డిజైన్ లో గల వివరాల ప్రకారం ఇది టెలివిజన్ రిసీవర్ కోసం అనువైన డిస్ప్లే తో ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా మీకు నచ్చినప్పుడు మడవడానికి వీలుగా ఉండే డిజైన్ ను కలిగి ఉంది. అలాగే రెండు వైపులా గల చదరపు ఫ్రేములు స్టాండ్లుగా మరియు సౌండ్ బార్లుగా కూడా పనిచేస్తాయి.

స్కెచ్‌ల ప్రకారం

నివేదికలో టీవీ యొక్క స్కెచ్‌ల ప్రకారం ఇది ఆరు సమాన భాగాలను కలిగి ఉండి జిగ్‌జాగ్‌ విధానంలో ముడుచుకోవడానికీ వీలుగా ఉంటాయి. ఇమేజింగ్ విధానంలో మూడు శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్స్ జతచేయబడి ఉంటాయి. రెండు వైపులా ఒక ఫ్రేమ్ ఉంటుంది. అది టీవీకి స్టాండ్‌గా కూడా పనిచేస్తుంది. ఈ టీవీతో సౌండ్‌బార్ కూడా క్లెయిమ్ చేయబడింది. ఇది ఎక్కువగా ఫ్రేమ్‌లో ఉంటుంది. ఈ టీవీ కనీసం 21: 9 కారక నిష్పత్తితో మరియు మెరుగైన దృడత్వంతో అందిస్తుందని చెబుతున్నారు.

 

సికింద్రబాద్ రైళ్లలో హై-టెక్ దొంగతనాలు జాగ్రత్త సుమా....సికింద్రబాద్ రైళ్లలో హై-టెక్ దొంగతనాలు జాగ్రత్త సుమా....

ఫోల్డబుల్ టీవీ

ఎల్జీ నుండి లభిస్తున్న ఈ ఫోల్డబుల్ టీవీ గురించి ఇంకా ఎటువంటి స్పష్టతగల సమాచారం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని టీవీల వలె రిమోట్‌తో వస్తుందా లేదా మీ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్‌గా అందిస్తుందో ఇంకా తెలియాలసి ఉంది. ఇప్పటి వరకు గల శామ్సంగ్ టీవీ యొక్క ధరలు ఎల్జీ నుండి వచ్చిన టీవీల కంటే కాస్త అధికంగా ఉన్నాయి. ముందు ముందు చూడాలి దీని ధరలు ఏవిధంగా ఉంటాయో.

ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?

LG సంస్థ

LG సంస్థ ఇప్పటికే టీవీ రంగంలో మొదటి వరుసలో ఉంది. ఇప్పటి వరకు సంస్థ తక్కువ పరిమాణం గల టీవీలనే కాకుండా అధిక పరిమాణం గల స్మార్ట్ టీవీలను కుడా ఆవిష్కరించింది. LG యొక్క 79-అంగుళాల టీవీ రూ.1,89,590 ధరను కలిగి ఉంది.వీటితో పాటు 75-అంగుళాల టీవీ, 70-అంగుళాల టీవీ,65-అంగుళాల టీవీ కూడా వాటికి తగ్గ దరల వద్ద లభిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
LG Foldable TV: Company Got The Patent Rights

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X