ఎల్‌జీ నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉత్పత్తులు

దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ ఎలక్టానిక్స్, భారత్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2017 చివరినాటికి లేదు 2018 ఆరంభం నాటికల్లా ఈ ప్రొడక్ట్స్ ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి  దేశంలోని వివిధ టెలికం ఆపరేటర్లతో ఎల్‌జీ ఎలక్టానిక్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Read More : 72 గంటల పాటు ఓపెన్ సేల్ పై Redmi Note 4, పండుగ చేస్కోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఓటీ ఉత్పత్తుల విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది..

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఆశించిన మేర రాణించలేకపోతోన్న ఈ బ్రాండ్ ఐఓటీ ఉత్పత్తుల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. హోమ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎల్‌జీ ఎలక్టానిక్స్‌కు భారత్‌లో మంచి గుర్తింపు ఉంది. ఐఓటీ ప్రొడక్ట్స్ ద్వారా తన బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచుకోవాలని ఎల్‌జీ భావిస్తోంది.

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా..

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కే దక్కింది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ త్వరలో మరొక సంచలన ఆవిష్కరణకు నాంది పలకబోతోంది.

మరికొద్ది నెలల్లో సాకారం..

మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..?

యంత్రాలు, పరికరాలు ఇంటర్నెట్‌కు అనుసంధానమై

మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే.. యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట.

మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిపోతుంది.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి రకరకాల పనులను ఖచ్చితమైన సమయపాలతో వాటి వాటి మేధస్సును ఉపయోగించి సమర్థవంతంగా పూర్తి చేసేస్తాయి.

2020 నాటికి పూర్తిస్థాయిలో..

2020 నాటి కల్లా ఐఓటీ పరిధి మరింత విస్తరించి అందులో ఉపకరణాల సంఖ్య 20 వేల కోట్లకు చేరుకుంటుదని ఓ అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG to Launch IoT Products in India; Already In-Talks With Telecom Operators. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot