97 అంగుళాల భారీ TVని లాంచ్ చేసిన LG.. వివరాలు
LG ఎలక్ట్రానిక్స్ ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న OLED టీవీలను విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన CES కార్యక్రమంలో ఇప్పటికే ప్రదర్శించింది. అయితే తాజాగా లాంచ్ చేసిన వాటిలో 97 అంగుళాల భారీ టీవీని ఉంది. ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
ఎల్‌జీ OLED సీరిస్‌లో సుమారు 21 వేరియంట్ల మోడళ్లు ఉన్నాయి. 8K OLED Z3 సీరిస్, OLED ఈవో గ్యాలరీ ఎడిషన్ G3 సీరిస్, OLED ఈవో C3 సీరిస్, OLED B3 సీరిస్ మరియు A3 సీరిస్ టీవీలు ఉన్నాయి.

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల సైజుల్లో టీవీలను ఎల్‌జీ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటీలో కనిష్ఠంగా 42 అంగుళాల టీవీ ఉండగా.. గరిష్ఠంగా 97 అంగుళాల వరకు ఉన్నాయి. G3 ఒఎల్‌ఈడీ సీరిస్ టీవీలు 55 అంగుళాలు, 65 అంగుళాలు, 77 అంగుళాల సైజుల్లో ఉన్నాయి.
G3 సీరిస్ టీవీలు మెరుగైన అనుభూతిని ఇస్తాయని సంస్థ తెలిపింది. మరియు అప్‌డేటెడ్ webOS వెర్షన్‌తో రానున్నాయి. ప్రత్యేకమైన విజువల్ అనుభవాన్ని పొందుతారని ఎల్‌జీ పేర్కొంది.
ఈ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన టీవీ మోడళ్లు... ఆల్ న్యూ హోం రీడిజైన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రానున్నాయి. డాల్బీ విజన్, డాల్బీ ఆట్మోస్, మరియు మెరుగైన ఆడియో, వీడియో క్వాలిటీని కలిగి ఉన్నాయి. మరియు మంచి సినిమా అనుభవాన్ని ఇస్తుందని ఎల్‌జీ తెలిపింది. ఎల్‌జీ ఓఎల్‌ఈడీ టీవీలు గేమ్ అప్టీమైజర్ ఫీచర్‌ను కలిగి ఉంటాయని పేర్కొంది.
తాజాగా విడుదల అయిన టీవీలు 2 నుంచి 3 వారాల్లో ఎల్‌జీ వెబ్‌సైట్‌తోపాటు ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఎల్‌జీ OLED టీవీలు ధర రూ.1,19,990 నుంచి ప్రారంభమై రూ.75,00,000 వరకు ఉన్నాయి.
LG A3 4K స్మార్ట్ OLED టీవీ
సైజ్: 48, 55, 65 అంగుళాలు
డిస్‌ప్లే: 4K OLED
ప్రోసెసర్: ఆల్ఫా7 ఏఐ ప్రొసెసర్ 4K జెన్6
హెచ్‌డీఆర్ : డాల్బీ విజన్/ హెచ్‌డీఆర్10/ హెచ్‌ఎల్‌జీ
వెబ్ OS : 2.3
కనెక్టవిటీ: బ్లూటూత్ v5 మరియు Wi-Fi 5
LG B3 4K స్మార్ట్ OLED టీవీ
సైజ్ : 55, 65, 77 అంగుళాలు
డిస్‌ప్లే; 4K OLED
ప్రాసెసర్: ఆల్ఫా7 ఏఐ ప్రొసెసర్ 4k జెన్6
హెచ్‌డీఆర్ : డాల్బీ విజన్/ హెచ్‌డీఆర్10/ హెచ్‌ఎల్‌జీ
వెబ్ OS : 2.3
కనెక్టవిటీ: బ్లూటూత్ v5 మరియు Wi-Fi 5
LG C3 4K స్మార్ట్ OLED evo టీవీ
సైజ్: 42, 48, 55, 65, 77, 83 అంగుళాలు
డిస్‌ప్లే: 4ఖ ఆల్డ్రా హెడ్‌డీ
ప్రోసెసర్ : ఆల్ఫా9 ఏఐ 4K జెన్6
హెచ్‌డీఆర్ : డాల్బీ విజన్/ హెచ్‌డీఆర్10/ హెచ్‌ఎల్‌జీ
వెబ్ OS : 2.3
కనెక్టవిటీ: బ్లూటూత్ v5 మరియు Wi-Fi 5
LG G3 4K OLED evo టీవీ
సైజ్: 55, 65, 77 అంగుళాలు
డిస్‌ప్లే: 4K OLED
ప్రోసెసర్ : ఆల్ఫా9 ఏఐ 4K జెన్6
హెచ్‌డీఆర్ : డాల్బీ విజన్/ హెచ్‌డీఆర్10/ హెచ్‌ఎల్‌జీ
వెబ్ OS : 2.3
కనెక్టవిటీ: బ్లూటూత్ v5 మరియు Wi-Fi 6
LG Z3 8K స్మార్ట్ సిగ్నేచర్ OLED టీవీ
సైజ్: 88 అంగుళాలు
డిస్‌ప్లే: 8K OLED
ప్రోసెసర్: ఆల్ఫా ఏఐ ప్రాసెసర్ 8K జెన్6
హెచ్‌డీఆర్ : డాల్బీ విజన్/ హెచ్‌డీఆర్10/ హెచ్‌ఎల్‌జీ
వెబ్ OS : 2.3
కనెక్టవిటీ: బ్లూటూత్ v5 మరియు Wi-Fi 6
LG G2 4K స్మార్ట్ OLED evo టీవీ గ్యాలరీ డిజైన్
సైజ్: 55, 65, 97 అంగుళాలు
డిస్‌ప్లే: 4K
ప్రోసెసర్ : ఆల్ఫా9 జెన్6 ఏఐ ప్రోసెసర్ 4K
హెచ్‌డీఆర్ : డాల్బీ విజన్/ హెచ్‌డీఆర్10/ హెచ్‌ఎల్‌జీ
వెబ్ OS : 2.3
కనెక్టవిటీ: బ్లూటూత్ v5 మరియు Wi-Fi 6


Click it and Unblock the Notifications








