Home
News

LG నుంచి స్మార్ట్‌టీవీలు విడుదల.. AI మేజిక్‌ రిమోట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు..!

ప్రముఖ సంస్థ LG ఎలక్ట్రానిక్స్‌ సంస్థ తాజాగా భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌టీవీలను విడుదల చేసింది. ఇందులో OLED evo మరియు QNED evo మోడల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఆన్‌లైన్‌, రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఈ టివీ సిరీస్‌ సౌండ్‌ ఆప్టిమైజేషన్‌, యూజర్‌ పర్సనలైజేషన్‌, పిక్చర్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ వంటి ఫీచర్లున్నాయి.

ప్రాసెసర్‌ :
LG స్మార్ట్‌ టీవీ సిరీస్‌ అల్ఫా AI ప్రాసెసర్‌ జెన్‌ 2 పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుంది. యూజర్‌ అలవాట్లు, అవసరాలకు అనుగుణంగా డిస్‌ప్లే, సౌండ్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. దీంతోపాటు AI పిక్చర్ విజార్డ్‌, AI సౌండ్ విజార్డ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

LG launched OLED evo and QNED evo smart Tvs in india

42 అంగుళాల నుంచి 97 అంగుళాల వరకు :
ఇందులో OLED evo, QNED evo, OLED, QNED వంటి డిస్‌ప్లే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో 42 అంగుళాల నుంచి 97 అంగుళాల డిస్‌ప్లే ల వరకు ఉన్నాయి. LG OLED evo AI 4K మోడల్స్ 42, 48, 55, 65, 77, 83 అంగుళాల వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

అదే LG OLED evo AI 8K మోడల్స్ 77, 88 అంగుళాల డిస్‌ప్లేలలో ఉన్నాయి. అదే LG QNED AI మోడల్‌ 43, 50, 55, 65, 75, 86, 83 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. LG నానోసెల్‌ మోడల్స్‌ 43, 50, 55, 65, 75, 86 డిస్‌ప్లే వేరియంట్స్‌లో ఉంది.

డాల్బీ విజన్‌ :
ఈ OLED evo మోడల్స్‌ 165H రీఫ్రెష్‌ రేట్‌తో 4K సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు NVIDIA G-SYNC మరియు AMD ఫ్రీ సింక్‌ ప్రీమియం కు సపోర్టు చేస్తుంది. OLED డిస్‌ప్లే టీవీలు HDR10, డాల్బీ విజన్‌ తోపాటు TUV Rheinland మరియు Zeiss వంటి సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి.

ఈ స్మార్ట్‌టీవీ మోడల్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ను కలిగి ఉన్నాయి. AI సెర్చ్‌, AI Concierge వంటి టూల్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్ల ద్వారా కంటెంట్‌ నేవిగేషన్‌ చాలా సులభం అవుతుందని ఎల్‌జీ చెబుతోంది. ఈ స్మార్ట్‌టీవీలు ఏకంగా 5 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ పొందుతాయని సంస్థ తెలిపింది.

AI మేజిక్‌ రిమోట్‌ :
దీంతోపాటు ఈ మోడల్స్‌ AI మేజిక్‌ రిమోట్‌ను కలిగి ఉంది. ఈ రిమోట్‌ వాయిస్‌ కంట్రోల్‌ బటన్‌ను కలిగి ఉంది. మల్టీ యూజర్‌ వాయిస్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది AI వాయిస్ ID ద్వారా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. దీంతోపాటు AI Chatbot, AI Zone వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

దీంతోపాటు సౌండ్‌ పరంగా OLED evo మోడల్స్‌ వర్చువర్‌ 11.1.2 ఛానల్‌ సౌండ్‌ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. మరియు QNED evo టీవీలు వర్చువర్‌ 9.1.2 ఛానల్‌ ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీంతోపాటు ప్రత్యేకమైన గేమింగ్ ఆప్టిమైజర్‌ మెనూను కూడా కలిగి ఉంది.

ఎల్‌జీ OLED evo సిరీస్‌ మోడల్స్‌ బ్రైట్‌నెస్‌ అల్టిమేట్‌, డైనమిక్‌ టోన్ మ్యాపింగ్‌ ప్రో టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. ఈ టీవీలు వైర్‌లెస్‌ ప్రోటోకాల్స్‌ను సపోర్టు చేస్తాయి. ఇందులో బ్లూటూత్‌ 5.4, వైఫై, మ్యాటీ వంటివి ఉన్నాయి. వీటితోపాటు ప్రైవసీ డ్యాష్‌బోర్డు, డేటా షేరింగ్‌ కంట్రోల్స్‌ను కలిగి ఉంది.

ధరల వివరాలు :
LG OLED evo AI 4K ప్రారంభ ధర రూ.139990 గా ఉంది.
LG OLED evo AI 8K ప్రారంభ ధర రూ.9,99,990 గా ఉంది.
LG QNED AI ప్రారంభ ధర రూ.94990 గా ఉంది.
LG నానోసెల్‌ మోడల్స్‌ ప్రారంభ ధర రూ.59990 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
LG launched OLED evo and QNED evo smart Tvs in india, specs, features price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X