టార్గెట్ వెయ్యి కోట్లు!!

By Super
|
LG launches Cinema 3D Smart TV

వ్యాపారానికి మరింత అనువైన ఇండియా వంటి దేశాల్లో తమ మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ఎల్‌జీ ప్రణాళికల సిద్ధం చేస్తుంది. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలతో పాటు వివిధ వేరియంట్‌లలో మొబైల్ ఫోన్‌లను డిజైన్ చేసిన ఈ సంస్థ 3డి టీవీల మార్కెట్ పై దృష్టిసారించింది. తాజాగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వివిధ మోడళ్లలో 3డీ స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. 32 నుంచి 72 అంగుళాల సైజుల మధ్య వివిధ వర్షన్‌లలో లభ్యమవుతున్న వీటి ధరలు రూ.55,000 నుంచి 7 లక్షల వరకు ఉన్నాయి.

 

3డీ టీవీల అమ్మకాల ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఎండీ సూన్ క్వాన్ తెలిపారు. భారత్‌లో గతేడాది లక్ష 3డీ టీవీ సెట్స్ అమ్ముడయ్యాయని, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్య 5 లక్షలకి పెరగొచ్చన్నారు. ఈ ఏడాది ఒలింపిక్ క్రీడలు 3డీలోనూ ప్రసారం కానుండటం, 30కి పైగా ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇదే ఫార్మాట్‌లో విడుదల కానుండటం 3డీ కంటెంట్‌కి ఆదరణను సూచిస్తోందని క్వాన్ తెలిపారు. ఈ ఏడాది 2.5 లక్షల 3డీ స్మార్ట్ టీవీలు విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

 
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X