ఎల్‌జీ అమ్ముల పోదిలోకి మరో క్రొత్త సినిమా 3డీ టీవీ

Posted By: Staff

ఎల్‌జీ అమ్ముల పోదిలోకి మరో క్రొత్త సినిమా 3డీ టీవీ

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ నెక్ట్‌‌స జనరేషన్‌ 3డీ టీవీ అయిన సినిమా 3డీ టీవీని తాజాగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇటీవల ఈ ఉత్పాదనను ఎల్‌జీ కొరియా, ఫ్రాన్స్‌లలో ప్రవేశపెట్టి సంచలనం సృ ష్టించింది. ఈ నూతన హోమ్‌ ఎంటర్‌టైన్‌మెం ట్‌లో సంచలనం సృష్టించేదిగా ఈ 3డీ టెక్నా లజీ పేరుగాంచింది. ఇప్పుడది భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. సినిమా 3డీ టీవీ ప్రొప్రైటరీ ప్యాటర్న్‌డ్‌ రిటార్డర్‌ (ఎఫ్‌పీఆర్‌) ప్యానెల్‌ను కలిగి ఉంది.

ఆధునాతన 3డీ లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (ఎల్‌సీడీ) టెక్నాలజీగా ఆ టెక్నాలజీ గుర్తింపు పొందింది. సినిమా 3డీ టీవీ ఆవిష్కరణ సందర్భంగా ఎల్‌జిఐఎల్‌ మేనేజింగ్‌ డెైరెక్టర్‌ సూన్‌క్వాస్‌ మాట్లాడుతూ నేటి వినూత్న అంచనాలకు మించిన రీతిలో సాంకేతిక నైపుణ్యాలను, ఉత్పాదనలను అందించేందుకు ఎల్‌జీ కట్టుబడి ఉందన్నారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ యువతను లక్ష్యంగా పెట్టుకుని మార్కెటింగ్‌ ప్రణాళికలను రూపొందించిందని, వీటి అమలుకు రూ.300కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

మంగళవారం ముంబయిలో బాలీవుడ్‌ నటి కంగనా రౌనత్‌ వీటిని ఆవిష్కరించారు. ఫిల్మ్‌ పాటర్న్‌డ్‌ రిటార్డర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ టీవీని తొలిసారిగా తీసుకొచ్చిన ఘనత ఎల్‌జీదే. తేలిక పాటి కళ్లద్దాలు ధరిస్తే సరిపోతుందని.. షట్టర్‌ గ్లాసెస్‌ ధరించినపుడు కలిగే ఒత్తిడి వీటి వల్ల కళ్లపై ఉండదని కంపెనీ చెబుతోంది. ధరలు రూ.94,990 -1,64,990.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting